Saturday, February 15, 2025

అల్టిమేట్ లవ్ స్టోరీ మూవీ “అరి వీర భయంకర”

యూనివర్సల్ క్రియేటివ్ స్టూడియోస్, శ్రీకర్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై శేషు బాబు. సీహెచ్, కాసుల రామకృష్ణ నిర్మిస్తున్న సినిమా “అరి వీర భయంకర”. ఈ చిత్రానికి కిషన్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్సాఖాన్, వైదిక, ఐశ్వర్య, కనిక మోంగ్యా, అర్చనా రాయ్, డెబొర, అమిత శ్రీ , శృతి రాజ్, సోమదత్త, నాగ మహేశ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో “అరి వీర భయంకర” సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో

నిర్మాత శేషు బాబు. సీహెచ్. మాట్లాడుతూ – ఈ రోజు పూజా కార్యక్రమాలతో మా అరి వీర భయంకర సినిమా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మా యూనివర్సల్ క్రియేట్ స్టూడియోస్, రామకృష్ణ గారి శ్రీకర్ మూవీ మేకర్స్ తో కలిసి సినిమాను నిర్మిస్తున్నాం. దర్శకత్వ శాఖలో అపార అనుభవం ఉన్న కిషన్ గారి దర్శకత్వంలో మూవీ నిర్మించడం సంతోషంగా ఉంది. రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాం. మీ అందరి సపోర్ట్ తో త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

నటుడు నాగ మహేశ్ మాట్లాడుతూ – అరి వీర భయంకర సినిమాలో ఓ మంచి పాత్రలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకులు కిషన్ గారికి థ్యాంక్స్. డెడికేషన్ ఉన్న మంచి టీమ్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఒక మంచి చిత్రంతో త్వరలోనే మీ ముందుకు వస్తాం. అన్నారు.

హీరోయిన్ డెబొర మాట్లాడుతూ – నేను మోడలింగ్ చేస్తుంటాను. ఈ చిత్రంతో హీరోయిన్ గా మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. అరి వీర భయంకర మూవీలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. ఒక డెడికేటెడ్ టీమ్ తో వర్క్ చేస్తున్నాను. మా మూవీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ వైదిక మాట్లాడుతూ – నేను తెలుగులో నటిస్తున్న మూడో చిత్రమిది. డైరెక్టర్ కిషన్ గారు అరి వీర భయంకర సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈ మూవీలో తప్పకుండా నటించాలని అనుకున్నాను. వెంటనే ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాను. లవ్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉన్న చిత్రమిది. మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకునే చిత్రమవుతుంది. అన్నారు.

డైలాగ్ రైటర్ పోలూరు ఘటికాచలం మాట్లాడుతూ – అరి వీర భయంకర సినిమా టైటిల్ చూసి యూత్ ఫుల్ మూవీ అనుకుంటున్నారు కానీ ఇది అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చేలా ఉంటుంది. లవ్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే సెంటిమెంట్ ఉంటుంది. ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ ఏడాది మీ ముందుకు రాబోతున్న సినిమా ఇది. మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ అర్చనా రాయ్ మాట్లాడుతూ – నేను చాలా మూవీస్ చేశాను. అరి వీర భయంకర సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ వస్తాయి. టాలెంటెడ్ కాస్ట్ అండ్ క్రూ పనిచేస్తున్నారు. అరి వీర భయంకర సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ అమిత శ్రీ మాట్లాడుతూ – అరి వీర భయంకర సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఇది నాకు తెలుగులో రెండో మూవీ. వండర్ ఫుల్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేస్తోంది. నాకు ఈ మూవీలో ఆఫర్ ఇచ్చిన దర్శక నిర్మాతలు థ్యాంక్స్. మీ అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే. అన్నారు.

హీరోయిన్ కనిక మోంగ్యా మాట్లాడుతూ – ఈ రోజు మా అరి వీర భయంకర సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కిషన్ గారికి ప్రొడ్యూసర్స్ శేషు బాబు, రామకృష్ణ గారికి థ్యాంక్స్. మిమ్మల్ని ఇంప్రెస్ చేసే మంచి స్క్రిప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు మా డైరెక్టర్. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య మాట్లాడుతూ – మా అరి వీర భయంకర మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఒక సక్సెస్ ఫుల్ సినిమాలో పార్ట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. న్యూ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది. అన్నారు.

హీరోయిన్ శృతి రాజ్ మాట్లాడుతూ – అరి వీర భయంకర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండటం హ్యాపీగా ఉంది. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. త్వరలోనే ఓ హిట్ చిత్రంతో మీ ముందుకు వస్తాం. అన్నారు.

హీరోయిన్ సోమదత్త మాట్లాడుతూ – అరి వీర భయంకర సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాను. ఈ సినిమాలో ఒక పాట కూడా పాడాను. ఈ మూవీలో నటిస్తుండటం హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కిషన్ గారికి ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.

డైరెక్టర్ కిషన్ ప్రసాద్ మాట్లాడుతూ – నేను ఈవీవీ గారి దగ్గర, కోడి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశాను. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో చాలా అనుభవం ఉంది. టాలీవుడ్ లోని చాలా మంది స్టార్స్ తో వర్క్ చేశాను. సూర్యవంశ్ మూవీకి అమితాబ్ గారితో పనిచేయడం మర్చిపోలేను. ఈ సినిమా కథ కూడా వినకుండా మా ప్రొడ్యూసర్స్ శేషు బాబు గారు మూవీ చేద్దాం మీ అనుభవం మీద మీ టాలెంట్ మీద నమ్మకం ఉంది అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇదొక అల్టిమేట్ డిఫరెంట్ లవ్ స్టోరీ. దేవుడు ఎప్పుడు పుట్టాడో ప్రేమ అప్పుడే పుట్టింది. దైవం ప్రేమ ఒక్కటే. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సర్ ప్రైజ్ చేస్తూ మూవీ సాగుతుంది. ఈతరంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు అనేది చూపిస్తున్నాం. యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. మా ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. శేషు బాబు, రామకృష్ణ గారు నాకు రాముడు, కృష్ణుడు లా భావిస్తాను. ప్రొడ్యూసర్స్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని నమ్మే దర్శకుడిని నేను. ఒక మంచి హిట్ సినిమా చేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ – ఈ రోజు మా అరి వీర భయంకర సినిమా ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉంది. యానివర్సల్ క్రియేటివ్ స్టూడియోస్ శేషు బాబు గారితో కలిసి మా శ్రీకర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో 25 ఏళ్ల అనుభవం ఉన్న డైరెక్టర్ కిషన్ ప్రసాద్ గారితో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఒక మంచి కథతో కిషన్ గారు ఈ మూవీ చేస్తున్నారు. అరి వీర భయంకర ఎలా ఉండబోతుంది అనేది త్వరలోనే మీరు చూస్తారు. మా టీమ్ అందరికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ అక్సా ఖాన్ మాట్లాడుతూ – ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండటం సంతోషంగా ఉంది. శేషు బాబు, రామకృష్ణ గారు మూవీని బాగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కిషన్ గారు హిట్ సినిమా చేసేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు. కిషన్ గారు నాకు మూడు నాలుగేళ్లుగా తెలుసు. సినిమా కోసం కష్టపడే తత్వం ఉన్న దర్శకుడు. చాలా అనుభవం ఉన్న దర్శకుడు. ఇప్పుడు ఆయనకు రైట్ టైమ్ వచ్చింది. టాలెంటెడ్ ఆర్టిస్టులు ఈ మూవీలో ఉన్నారు. వారితో కలిసి వర్క్ చేసేందుకు ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని కోరుకుంటున్నా. అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com