ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, అకాల వర్షాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది.