Sunday, January 5, 2025

హామీలు నెర‌వేర్చ‌లేని నిస్స‌హాయ స్థితిలో రాష్ట్ర‌ స‌ర్కారు

  • రైతు భరోసా పేరిట కొర్రీలు పెట్టే యత్నం
  • రెండో వారంలో రైతుల కోసం నిర‌స‌న‌లు చేప‌డ‌తాం..
  • కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు, తర్వాత అనేక రకాల హామీలిచ్చింద‌ని, కానీ. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు జి.కిష‌న్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. శాసనసభ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి అనేక హామీలు ఇచ్చార‌ని, ఇప్పుడు ఏ హామీని అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంద‌న్నారు. ప్రజలను నట్టేట ముంచుతూ విజయోత్సవాల పేరుతో, అనేక పత్రికా ప్రకటనలతో సంబరాలు జరుపుకుంటోంది. తెలంగాణలో మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని అనేక రకాలుగా ప్రచారం చేసింది. నమ్మించి ప్రజల వోట్లు పొంది అధికారంలోకి వొచ్చింది. ఈ సంవత్సర కాలంలో వోట్లేసిన ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. తెలంగాణలో మార్పు రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మాత్రమే మార్పు వొచ్చింది.

గతంలో బిఆర్ఎస్ నాయకులు దోచుకునేవాళ్లు… కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నది. నేడు కాంగ్రెస్ మంత్రులు దోచుకుంటున్న పరిస్థితి నెలకొంది అని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంద‌ని, . డిసెంబరు 7న ప్రమాణ స్వీకారం  అన్నారు.. 9వ తేదీన రుణమాఫీ ఫైలుపై సంతకం పెడతామన్నరు. అరకొర రుణమాఫీ మాత్రమే చేశారు. కాంగ్రెస్ పార్టీది చేతల ప్రభుత్వం కాదు.. ఇది మాటలు, కోతల ప్రభుత్వం మాత్రమే. రైతు భరోసా పేరిట అనేక రకాల కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు. కౌలు రైతులు, రైతు కూలీలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో ఏయే పంటలు సాగు చేస్తున్నారు.. ఏ గ్రామంలో రైతులు ఎంత సాగు చేస్తున్నారు..? ఎంతమంది రైతుకూలీలు ఉన్నారనే అన్ని రకాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ దరఖాస్తుల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.

రుణమాఫీకి వాయిదాలతో కోత పెట్టారు. రైతు భరోసాకు కూడా కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నారు. కేంద్రం రైతులను ఆదుకునేలా తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజనను అమలు చేయడంలేదు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ రైతులకు అనేక హామీలిచ్చింది. రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నది. ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలపై రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదు. పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలకు రూ. 500 చొప్పున అదనంగా బోనస్ ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా మోసం చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి పంటకు రూ. 500 బోనస్ ఇస్తమని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. కనీసం వరిధాన్యానికి కూడా ఇవ్వడం లేదు. కేవలం సన్నరకం ధాన్యానికే బోనస్ అంటూ సన్నాయినొక్కులు నొక్కింది. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆందోళన చేస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి అవమానించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆందోళన చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టి, రైతుల చేతికి సంకెళ్లు వేసి అవమానిస్తోదంని కిష‌న్ రెడ్డి అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com