Saturday, May 17, 2025

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి

శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జేడిఎస్ సీనియర్ నేత హెచ్‌డి కుమారస్వామికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ట్వీట్ చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్స్‌లకు టెక్నాలజీకి గేట్‌వేగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే.

అలాగే భారతదేశాన్ని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి సంపద, ఉపాధి కల్పనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, పరిశ్రమలకు తెలంగాణను అత్యుత్తమ గమ్యస్థానంగా మార్చేందుకు తమ కార్యక్రమాలతో తదుపరి వృద్ధికి తాము మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందు కోసం మీ సహకారాన్ని కోరుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు రాసుకొచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com