సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. అక్కన్నపేట మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలో ఓ ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు ఉపాధి హామీ పనుల నిమిత్తం.. గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ పనులు చేస్తుండగా.. ఉన్నట్టుండి మట్టి దిబ్బ కూలిపోయింది. ఈ మట్టి దిబ్బల కింద పడి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను కందరపు సరోజన(52), ఆమె కూతురు మమత(25)గా పోలీసులు గుర్తించారు.