Wednesday, March 26, 2025

అర్జంట్‌.. హస్తినకు రండి

అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు

తెలంగాణ ప్రభుత్వంలోగానీ, లేక కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయా అంటే అవుననే వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారని సమాచారం. పార్టీ కీలకనేత కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సాయంత్రం భేటీకానున్నారు. సోమవారం నుంచి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ పెద్దలతో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరు ఢిల్లీకి వెళ్తారన్న సమాచారం రాగానే మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్సీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్ విభజనపై ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో చర్చిస్తారని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా కలిగే నష్టం, రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై చర్చించారు. చెన్నై సదస్సులో తీర్మానాలతో పాటు దక్షిణాదిన డీలిమిటేషన్ పై జరుగుతున్న గందరగోళాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి, భట్టి మంతనాలు జరుపుతారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com