Friday, April 4, 2025

Sweeper Owns 9 Luxury Cars రోడ్లు ఊడ్చే మామూలు స్వీపర్‌ ఇంట్లో 9 లగ్జరీ కార్లు

మనం తెలుగు రాష్ట్రాల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు చిన్న చిన్న పోస్టుల్లో ఉంటూనే లంచాలు తీసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించిన ఉదంతాలు ఎన్నో చూస్తున్నాము. ఇదిగో అచ్చు ఇలాగే ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఓ మామూలు రోడ్లు ఊడ్చే స్వీపర్ కు ఉన్న కోట్ల రూపాయల ఆస్తులు చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. అవును యూపీలోని గోండా జిల్లా కు చెందిన ఓ స్వీపర్‌ కోట్లకు పడగలెత్తాడు. ఈ సాధారణ స్వీపర్ సంతోష్‌ జైస్వాల్‌ మొదట్లో గోండా మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిలో చేరాడు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా డివిజనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో స్వీపర్‌ గా ప్రమోషన్ తెచ్చుకున్నాడు.

ఇక్కడే అతడు తన అక్రమ సంపాదనకు మార్గాలను అన్వేషించి.. ఆఫీసులోని ప్రభుత్వ ఫైళ్లను తారుమారు చేసి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టాడు. ఐతే ఎప్పుడో ఓ అప్పుడు విషయం బయటపడకుండా ఉంజదు కదా. ఇలా సంతోష్‌ జైస్వాల్‌ ముఖ్యమైన ఫైళ్లను మారుస్తున్న విషయాన్ని అధికారులు పసిగట్టేశారు. విషయం బయటపడిన వెంటనే కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. అంతే కాదు సంతోష్‌ జైస్వాల్‌ ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు, పోలీస్‌ కేసు నమోదు చేశారు.

ఇక సంతోష్‌ జైస్వాల్‌ ఆస్తులు లెక్కగట్టిన అధికారులు అవాక్కయ్యారు. అతడి వద్ద ఏకంగా తొమ్మిది అత్యంత విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయట. ఈ లగ్జరీ కార్లు సంతోష్‌ సోదరుడు, భార్య పేరు మీద రిజిస్టర్ అయినట్లు అసిస్టెంట్‌ డివిజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి నివేదిక ఇచ్చారు. ఇక సంతోష్‌ జైస్వాల్‌ బ్యాంకు అకౌంట్ లోను కోట్ల రూపాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా అతడితో పాటు కుటుంబ సభ్యుల పేర్ల మీద విలువైన ఆస్తులు కూడా ఉన్నట్లు తేలడంతో ఆతనిపై చర్యలకు సిద్దమవుతున్నారు అధికారులు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com