Wednesday, May 14, 2025

‘వాళ్లని వదలొద్దు’..!

ఉగ్రదాడిపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 28 మంది పర్యాటకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. యూరీ, పుల్వామా కన్నా ఇది తీవ్రంగా ఖండించదగిన దాడి అంటూ వ్యాఖ్యానించారు. ఈ దాడిలో మరణించినవారి బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీనికి బాధ్యులైన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
” పహల్గాంలో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కేంద్రం శిక్షిస్తుందని ఆకాంక్షిస్తున్నాం. మృతుల కుటుంబాలకు అండగా నిలబడుతాం. ఈ దాడిలో గాయపడ్డవారు వెంటనే కోలుకోవాలని కోరుతున్నాం. ఈ ఉగ్రదాడి.. యూరీ, పుల్వామా కన్నా తీవ్రంగా ఖండించదగినది. ఈసారి ఉగ్రవాదులు ప్రజలను టార్గెట్‌ చేసి కాల్పులు జరిపారు. ఇదొక నరమేధమని” అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఇదిలాఉండగా.. పహల్గాంలోని బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడికి ‘ది రిసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం 6 నుంచి 8 మంది ఉగ్రవాదులు సైనిక దూస్తుల్లో వచ్చి పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డారు. వాళ్లు ఏకే 47, ఏకే 56 గన్‌లతో టూరిస్టులను కాల్చేశారు. ఈ భీకర దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మరోవైపు ఈ దాడికి కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సర్జికల్ స్ట్రైట్‌కు ప్లాన్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com