Thursday, April 3, 2025

వాస్తు బాగాలేదు.. సీటుకు గండం

వాస్తు దోషాల చుట్టూ తెలుగు రాజకీయాలు= ఏపీలోనూ మార్పులు

ప్రజల ఓట్లతో గెలిచి.. అధికారంలోకి వచ్చిన నేతలంతా కుర్చీ ఎక్కగానే వాస్తు చుట్టూరా ప్రదిక్షణలు చేస్తున్నారు. ప్రధానంగా తెలు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రులుగా ఆసీనులైన వారు.. వారికి వాస్తుకు అనుగుణంగా పాలనా కార్యక్రమాలు మార్చుకుంటున్నారు. పాలనా కేంద్రాల్లో వాస్తు దోషాలను సవరించుకుంటూ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వాస్తుదే ఉన్నత రాజకీయంగా మారిపోయింది. మొన్నటి నుంచి తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు, సవరణలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌ చేస్తే.. ఇప్పుడు తాడేపల్లిలో చంద్రబాబు కూడా అదే పని మొదలుపెట్టారు. గతంలో ఇక్కడ కేసీఆర్‌, అక్కడ జగన్‌ కూడా వాస్తు దోషాలకే కట్టుబడి పాలన చేశారు. ఎంత మేరకు అంటే.. వాస్తు బాగాలేదని సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఏకంగా సచివాలయానికే దూరంగా ఉన్నారు.

వాస్తు ఉంటేనే..!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు వాస్తుకు ఎక్కవ ప్రధాన్యత ఇస్తున్నారు. వారి పేరు బలం, వాస్తు కుదరడం లేదంటూ వేల కోట్ల ప్రజాధనం వాస్తుపేరిట దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్ కొత్త సచివాలయంతో మొదలు రేవంత్ అదే సచివాలయానికి గేటు మార్పించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో వాస్తు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జగన్ దక్షిణ దిశలో కంచెను ఆయన సిబ్బంది తొలిగించారు. తాజాగా ఈశాన్యంలో మార్పులు చేస్తున్నారు. కలిసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. తూర్పు ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ఇంటికి వాస్తు మార్పులు చేయడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వాస్తు దోషం వల్లే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. వాస్తుదోషాల కారణంగా చంద్రబాబు అప్పుడు అరెస్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. వాస్తు కరెక్ట్ గా సెట్ అవ్వకనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సొంత ఇల్లు కట్టుకోలేదని చర్చలు నడుస్తు్న్నాయి. అంతేకాదు ఇటీ వల ఆయన అవరావతిలో ఇంటి స్థలం కొన్నారు. అందులో ఇంటి నిర్మాణానికి వాస్తు చూయిస్తున్నారు.

వాస్తు దోషం వల్లే బాబు ఓటమి!
చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసం వల్లే ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఓటమి ఎదురైందని వాస్తు పురుష ప్రసాద్ తెలిపారు. జగన్ ఇంటికి వాస్తును అందించిన ఆయన.. ఉండవల్లిలో కరకట్ట మీద బాబు నివాసానికి రెండు వైపులా నుంచి రోడ్లను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇది వాస్తు దోషమన్నారు. లింగమనేని నిర్మించిన ఈ గృహానికి శల్య స్థితిని ఆచరించలేదన్నారు. ఇల్లు నిర్మించిన చోటు.. పాములు తిరగాడే ప్రదేశమన్నారు. బాబు సీఎం అయ్యాక.. అక్కడ వాస్తును పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని.. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. మంత్రులు కూడా ఓటమి పాలవడానికి బాబు నివాసానికి వాస్తు లోపించడమే కారణమన్నారు. బాబు కరకట్ట నివాసాన్ని వదిలిపెడితేనే బాగుపడతారని.. లేదంటే కుటుంబంలోనూ వైషమ్యాలు తప్పవన్నారు.

కేసీఆర్ వాస్తుకే ప్రయార్టీ
కేసీఆర్ కు వాస్తు సెంటిమెంట్ బాగా ఉంటుందని చాలా వంది రాజకీయ నేతలు చెప్తుంటున్నారు. కేసీఆర్ వాస్తు సెంటిమెంట్ అంశం గుర్తు రాకమానదు. గులాబీ పార్టీ అధినేతకు వాస్తు పట్ల నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకంతోనే ఆయన 9 ఏళ్ల పాటు సెక్రటేరియట్ మెట్లు ఎక్కలేదు. ఇంత కాలంపాటు అధికారంలో ఉండి సెక్రటేరియట్‌కు వెళ్లని సీఎం కేసీఆరేనంటూ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. వాస్తు సెంటిమెట్ కారణంగానే ఏళ్ల తరబడి సెక్రటేరియట్‌కు వెళ్లని కేసీఆర్.. చివరికి దాన్ని కూల్చివేయించి కొత్త సచివాలయాన్ని నిర్మించారు. అందులోనూ తనకు అచ్చొచ్చిన ‘ఆరు’ సెంటిమెంట్‌ను ఫాలో అయ్యారు. చివరకు 2023 ఏప్రిల్ చివర్లో కొత్త సెక్రటేరియట్‌ను ప్రారంభించిన కేసీఆర్.. వేద మంత్రోచ్ఛరణల మధ్య సీఎం ఛాంబర్‌లో ఆసీనులయ్యారు. అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెకట్రేరియట్ నిర్మించడాన్ని తెలంగాణ పునర్ నిర్మాణమంటూ కేసీఆర్ సమర్థించుకున్నారు. ఇలాంటి కామెంట్లు చేసిన వారిని గులాబీ బాస్ మరుగుజ్జులని అభివర్ణించారు.
కొత్త సచివాలయాన్ని నిర్మించే క్రమంలో కేసీఆర్ ‘6’ సెంటిమెంట్‌కు పెద్దపీట వేశారు. ఆరు అంతస్థులు.. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 6 కాన్ఫరెన్స్ హాళ్లు, 6 డైనింగ్ హాళ్లు, 6 పార్కులు… ఇలా డిజైన్లో అన్నింటా ఆరు కలిసొచ్చేలా కేసీఆర్ ప్లాన్ చేశారు. లిఫ్టులు కూడా ఈ సెంటిమెంట్ ప్రకారమే పెట్టారు. ఈ క్రమంలోనే కేసీఆర్ విమర్శలను సైతం లెక్కచేయలేదు.

రేవంత్ కూడా వాస్తు బాటలోనే..
తెలంగాణ సెక్రటేరియట్‌కి వాస్తు మార్పులు చేస్తోంది రేవంత్ సర్కార్. నేటి నుంచి గేట్ నెంబర్-4 గుండా సచివాలయంలోకి సీఎం రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ వెళ్లనుంది. ఇదే గేటు నుంచి లోపలికి మంత్రులు, సీఎస్‌, డీజీపీ వెళ్లనున్నారు. సౌత్‌ ఈస్ట్‌ గేట్‌-2 నుంచి అధికారులు, ఇతర వీఐపీలు సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. వెస్ట్‌ గేట్‌ -3కి మరమ్మత్తులు ఇంకా పూర్తి కాలేదు. ఈస్ట్ గేట్‌-1 పూర్తిగా మూసివేయనున్నారు. అధికారుల విధులకు ఇబ్బంది కల్గకుండా రాత్రి వేళల్లో సెక్రటేరియట్‌లో వాస్తు మార్పు పనులు చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com