వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శుక్రవారం మంత్రి మాట్లాడుతూ పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుని ఈ రోజుతో 15 నెలలు అయ్యిందని, గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి అస్తవ్యస్ధంగా తయారైందన్నారు. అయినా తెలంగాణ ప్రజానీకానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామపి, అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేటవుతుందన్నారు. పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందని, ఇచ్చిన ప్రతి మాటను. హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.