వదినమ్మ ఇచ్చిన బహుమతి చూసి సంతోషం పట్టలేకపోయిన పవన్
మొన్నటిదాకా పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో మెగా కుటుంబంలో సంతోషానికి అవధుల్లేవనే చెప్పాలి. మొన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వంలో పవన్ ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు.
ఈ విజయాన్ని మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సంతోషకరమైన సందర్బాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ పెన్నును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకున్నారు.
సురేఖ స్వయంగా మోంట్ బ్లాంక్ పెన్నును తీసి, పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా ఆయన సంతోషం పట్టలేకపోయారు. అప్పటికే పవన్ తన దగ్గర ఉన్న ఉన్న పెన్ను తీసి వదినకు చూపించగా, ఇది కూడా అట్టిపెట్టుకో అన్నట్లు సురేఖ చెప్పడం అందరిని ఆకర్షించింది. ఈ ఆనందకరమైన సమయంలో ఒకవైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్ సతీమణి అన్నాలెజినోవా వచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు.
తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.. వదిన, అన్నయ్య.. అంటూ చిరంజీవి వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అన్నట్లు సురేఖ తన మరిది పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మోంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్నుల ధర సుమారు 2.60లక్షల వరకూ ఉంటుందట.