Sunday, February 23, 2025

వదినను నేను చూసుకుంటా.. అన్నయ్యను చంపేస్తా తల్లికి చెప్పి మరీ నరికిన సోదరుడు!

తెలంగాణలోని మేడ్చల్‌లో బస్ డిపో ముందు దారుణ హత్య జరిగింది. ఉమేశ్ అనే వ్యక్తిని సోదరులే నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. మేడ్చల్‌ సోదరుల మర్డర్‌ కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మద్యానికి బానిసైన ఉమేశ్ తరచూ భార్య, తల్లిని కొట్టేవాడు. ఉమేశ్ టార్చర్ భరించలేక తమ్ముడు రాకేశ్ తన అన్నను చంపుతానని తల్లికి చెప్పాడు. వదినను తాను చూస్కుంటానని హామీ ఇచ్చి మరీ నరికి చంపాడు.

వదినను నేను చూసుకుంటా
ఉమేశ్ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఏ పని చేయకుండా రోజూ తాగి వచ్చి ఇంట్లో గొడవ చేసేవాడు. అదే క్రమంలో తన భార్య, తల్లిని కొట్టేవాడు. ఇలా తరచూ ఫ్యామిలీని టార్చర్ చేస్తూ ఉండేవాడు. సోదరులు ఎంత చెప్పినా అన్న ఉమేశ్ వినేవాడు కాదు. దీంతో సోదరులకు ఓపిక నశించింది. అన్నను చంపేస్తామని తమ్ముడు రాకేశ్ ముందుగానే తన తల్లికి చెప్పాడు. తర్వాత ఏది అయితే అది అవుద్దని.. వదినను నేను చూసుకుంటానని రాకేశ్ హామీ ఇచ్చాడు. అనంతరం నిన్ను చంపుతానంటూ రాకేశ్ తన అన్నకు ఫోన్ చేశాడు. ఇక చెప్పినట్లుగానే అన్నను కసితీరా నరికి చంపాడు. ఉమేశ్‌ను వేటాడి, వెంటాడి మరీ నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆపై అక్కడ నుంచి పరారయ్యాడు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com