కవాజ్‌పేయికి ఘన నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని ప్రముఖులు
దివంగత ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీ 100వ జయంతి ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక నాణేన్ని విడుదల చేశారు. వాజ్‌పేయి వందవ జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా స్టాంప్‌ను కూడా మోదీ విడుదల చేశారు.
మరోవైపు వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా బుధవారం దిల్లీలోని సద్కెవ్ అటల్ స్మారకం వద్ద నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కడ్, స్పీకర్ ఓం బిర్లా , ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, హెచ్‌డీ కుమార స్వామి ఇతర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏపీ సీఎం చంద్రబాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, బీజేపీ నేతలు వాజ్‌పేయికి నివాళి అర్పించారు.