ఆ హీరోయిన్ దగ్గర అసలు పని చేయలేం… పారిపోతున్న అసిస్టెంట్లు
అందంగా, అణుకువగా కనిపించే హీరోయిన్లు అందరూ తమ దగ్గర పనిచేసే స్టాఫ్‌తో అలాగే ఉంటారని అనుకుంటే పొరపాటే. ఓ అందాల భామ దగ్గర పనిచేయలేమని అసిస్టెంట్లు దండం పెడుతున్నారు. సెలబ్రిటీల దగ్గర పని చేయడం అంత సులభం కాదని ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ వర్గాలు చెప్పే మాట. అయితే… తెలుగు ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి దగ్గర పని చేయడం చాలా అంటే చాలా కష్టం అంటూ అసిస్టెంట్లు పారిపోతున్నారు.
నలుగురు అసిస్టెంట్లు మారారు… మేనేజర్లు ఇద్దరు… కష్టం బాబోయ్!
తెలుగులో ఒక్కటే సినిమా చేసిన అందాల భామకు ఆఫర్లు మాత్రం బాగా క్యూ కడుతున్నాయి. ఆమెకు యూత్ ఆడియన్స్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ప్రజెంట్ ఆ అమ్మాయి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో పాన్ ఇండియా ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందనే మాటలు వినపడుతున్నాయి. స్క్రీన్ మీద అందంగా కనిపించే ఆ అమ్మాయి… స్క్రీన్ వెనుక అసిస్టెంట్లకు చుక్కలు చూపిస్తుందట.
అందాల భామ దగ్గర పని చేయలేం బాబోయ్ అంటూ ఇప్పటికి నలుగురు అసిస్టెంట్లు మానేశారట. తెలుగులోకి ఆ అమ్మాయి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఉన్న మేనేజర్ ఇప్పుడు లేరు. ఆమెతో వేగలేమని ఓ మేనేజర్ పక్కకు వెళితే… మరొక మేనేజర్ అమ్మాయి ప్రవర్తనతో వేగలేక ఇబ్బంది పడుతున్నారట.
అమ్మాయి పెద్ద కలర్ ఉండదు. కానీ, ముఖంలో కళ ఉంటుంది. స్క్రీన్ మీద అందాల ప్రదర్శనకు పెద్దగా అభ్యంతరం చెప్పదు. కానీ, తన ఫుడ్ – డైట్ విషయంలో అభ్యంతరాలు చాలా ఉంటాయి. అమ్మాయి చెప్పిన ఫుడ్ టేబుల్ మీదకు రాకపోయినా, డైట్ ఫాలో అవ్వడంలో, ఫుడ్ తీసుకురావడంలో అసిస్టెంట్లు అలసత్వం ప్రదర్శించినా ఆమెకు కోపం వస్తుందట. ఆ కోపాన్ని తట్టుకోవడం కష్టం అని ఆ అందాల భామ దగ్గర పని చేసిన జనాలు చెప్పే మాట. స్టార్ హీరోలు హీరోయిన్లకు చాలా ప్రెజర్స్ ఉంటాయి. బయటకు కోపాన్ని చూపించలేరు. అందువల్ల ఒక్కోసారి అసిస్టెంట్స్ మీద అరుస్తారు. అసిస్టెంట్లకు అసలు విషయం తెలుసు కనుక, కోపం తమ మీద కాదని అర్థం చేసుకొని సర్దుకు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ బయట కోపాన్ని కాకుండా తమ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండడంతో పనిచేయలేమని అసిస్టెంట్లు దండం పెడుతున్నారు.