- అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతు బంధు ఇప్పిస్తా
- హామీలు అమలు చేసేదాకా.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అనే పిలుస్తా..
- వనపర్తి రైతు, ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ పాలనతో కొత్త పథకాలు రాలేదు.. ఉన్న పథకాలను బంద్ చేస్తున్నారని, బతుకమ్మ చీరెలు.. కేసీఆర్ కిట్లు.. చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేయడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. రైతు బంధు, రుణమాఫీ, బీమా పేరిట లక్షా రూ50 కోట్లు కేసీఆర్ రైతులకు ఇచ్చారని, కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీ అని చెప్పి పచ్చి మోసం చేశారని విమర్శించారు. రైతు బంధు ఇవ్వాలంటే ఊకుందామా ఊరికిద్దామా? అని హరీష్ రావు ప్రశ్నిచారు. వనపర్తిలో నిర్వహించిన రైతాంగ, ప్రజా నిరసన సదస్సులో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదివేల మంది స్వచ్ఛందంగా తరలిరావడం చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారనే దానికి నిదర్శనమన్నారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, సన్నాలకు అని మాట తప్పాడని అన్నారు. డెడ్ లైన్, పేపర్ హెడ్ లైన్ మారాయి. రుణమాఫీ ఒక లైన్ లోకి రాలేదు. వరంగల్ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటైనా అమలవుతుందా? అయితే దేవుని మీద వొట్లు అడిగితే తిట్లు. తిట్లతో పాటు కేసులు కూడా ఉన్నాయి.
తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, చంద్రబాబు, వైఎస్ మీద పోరాటం చేసినోళ్ళం డిసెంబర్ 9, 2023 నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేయలేదు. 45వేల కోట్లు అని, 29వేల కోట్లు అని, 17 వేల కోట్లు చేసినట్లు ప్రచారం చేశారు. సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. కేసీఆర్ అందరికీ రైతు బంధు ఇస్తే నిబంధనలు పెట్టీ రుణమాఫీ ఎగవేశారు. పాలకుడు దేవుళ్ళ మీద వొట్లు పెట్టి మాట తప్పితే రాష్ట్రానికి అరిష్టమవుతుందని నేను దేవుడికి పూజలు చేశా. ప్రజల్ని కాపాడు, పాపాత్ముడిని క్షమించు అని వేడుకున్నా దానికి కూడా నా మీద కేసులు పెట్టారు అని హరీష్‌రావు అన్నారు. హామీలను నెవరేర్చేవరకు ఏనుముల రేవంత్ రెడ్డిని ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తానని చెప్పారు.పది నెలలు అయ్యింది మ్యానిఫెస్టోలో చెప్పినవి అమలు చేయలేదంటే బేగం బజార్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు. మూసీ పేరిట లక్షా 50 వేల కోట్లు అంటున్నాడు కానీ రైతులకు రైతు బంధు ఇచ్చేది లేదు. ఒకప్పుడు వనపర్తిని వలసల వనపర్తి అనేవారు.
మేము వొచ్చాక బుద్దారం బ్రాంచ్ కెనాల్, ఘనపురం తవ్వించాం. కేసీఆర్ వలసల వనపర్తిని వరికోతల వనపర్తి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజి, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చారు. వనపర్తిని సరస్వతి నిలయం చేసింది నిరంజన్ రెడ్డి అని కొనియాడారు. పది నెలల కాలంలో వనపర్తిల పైసా పని అయ్యిందా? అని ప్రశ్నించారు. అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి రోడ్ల మీదకు తెచ్చాడు. జివో 29 తెచ్చి ఎస్సీ, ఎస్టీ లకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నాడు. అర్ధరాత్రి విద్యార్థులను గొడ్డును కొట్టినట్లు కొట్టిస్తున్నారు.
పోలిసొల్లను నమ్మడం లేదు. స్పెషల్ పోలీసులను తొలగించి ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టారు. ముఖ్యమంత్రిగా వారి సమస్యలు పరిష్కరించడంలో ఫెయిల్ అయ్యారు. పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. రైతులు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు. కరెంట్ బిల్లులు పెంచవద్దని కోట్లడితే పెంచలేదు.. బిఆర్ఎస్ పోరాటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతు బంధు ఇప్పిస్తా. మహిళలకు రూ.2,500 మహాలక్ష్మి, ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ కూలీలకు చెప్పినట్లు హామీలు ఇవ్వాలి. అక్రమ కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి స్పష్టం చేశారు.