మంగళవారం కురిసిన వర్షానికి నీట మునిగిన రామచంద్రపురం ప్రాంతంలో హైడ్రా అధికారులు పర్యటించారు. హైడ్రా కమిషనర్‌తో పాటు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఇక్కడ పూడుకుపోయిన కాలువలను తెరిపించడంతో పాటు బైపాస్ గా వరదకాలువ తవ్వకాలను పరిశీలించారు. వర్షాకాలం మళ్ళీ ఇక్కడ రోడ్డు మీద నీరు నిలబడకుండా.. వరద కాలువల ద్వారా వెళ్లేలా కాలువను విస్తరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. రామచంద్రాపురంలో నీరు నిలబడడానికి కారణాలను జీహెచ్‌హెంసీ, నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చందానగర్ లింగంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సురభి కాలనీ ప్రారంభంలో ఉన్న ఆర్ యూ బీ వద్ద నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. గోపి చెరువు, చాకలి చెరువుల నుంచి వచ్చే వరదతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో ఇబ్బంది ఏర్పడుతోందని ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు హైడ్రా దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ బాక్స్ డ్రెయిన్ విస్తరించడంతో ఈ ఏడాది కొంత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని వివరించారు. కాగా, డ్రైన్లలో చెత్త పేరుకుపోకుండా చూడాలని అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు.