Wednesday, May 7, 2025

మోదీకి వరలక్ష్మీ పెళ్లిపిలుపు

న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ నెల రోజులుగా పెళ్లి ప‌నుల్లో బిజీ బిజీగా గ‌డుపుతోన్న సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా తానే పెళ్లి కార్డుల‌ను పంపిణీ చేస్తోంది. ఇప్ప‌టికే టాలీవుడ్ సెల‌బ్రిటీలంద‌ర్నీ క‌వ‌ర్ చేసింది. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు అంద‌ర్నీ క‌లిసి స్వ‌యంగా కార్డులు అంద‌జేసింది. త‌ప్ప‌కుండా రిసెప్ష‌న్ కు రావాల‌ని ఆహ్వానించింది. ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంత వ‌ర‌కూ ఏ న‌టి కూడా ఇలా స్వ‌యంగా హాజ‌రై కార్డులు పంపిణీ చేసింది లేదు. అందులో టాలీవుడ్ లోనూ అంద‌ర్నీ క‌వ‌ర్ చేసి ఇవ్వ‌డం అన్న‌ది వ‌ర‌ల‌క్ష్మి ప్రత్యేక‌తే అనే చెప్పాలి. మ‌రోవైపు కుమార్తె కోసం తండ్రి శ‌ర‌త్ కుమార్ కూడా చెన్నైలో ఉండి తాను చేయాల్సిన ప‌నుల‌న్నీ చేస్తున్నారు. కోలీవుడ్ ఇండ‌స్ట్రీని ఆయ‌న క‌వ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మైన వారంద‌రికీ స్వ‌యంగా ఆయ‌నే వెడ్డింగ్ కార్డులు అంద‌జేసారు. తాజాగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కుటుంబ స‌భ్యులు ఏకంగా దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని కూడా క‌లిసి ఆహ్వాన ప‌త్రిక అంద‌జేసారు. వ‌ధువు వ‌ర‌ల‌క్ష్మి-వ‌రుడు నికోల‌య్ స‌చ్ దేవ్, శ‌ర‌త్ కుమార్, రాధిక న‌లుగురు మోదీని క‌లిసి కార్డు అందించారు. అయితే ప్ర‌ధాని అంత బిజీ షెడ్యూల్ లోనూ వాళ్ల‌కు స‌మ‌యం ఇవ్వ‌డంతో కుటుంబ స‌భ్యులంతా సంతోషం వ్య‌క్తం చేసారు. మోదీకి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com