గత ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను 2024 ఎన్నిల్లో అనవసరంగా గెలిపించామని టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఇన్‌చార్జ్, కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాజకీయ పీఠానికే డిప్యూటీ సీఎం పవన్ ఎసరు పెట్టారనే ఆవేదన ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది. పోత్తులో భాగంగా పిఠాపురం సీటును జనసేనకు కేటాయించారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే వర్మ అనుచరులు అగ్గిగుగ్గిలమయ్యారు. వర్మ కూడా కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకపోతే వర్మను చంద్రబాబు పిలిపించుకుని, పిఠాపురం టీడీపీ కార్యకర్తల సమక్షంలో తాము అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వర్మ పవన్‌కు మద్దతు పలకడం జరిగింది.
ఇక కూటమి అధికారంలోకి రావడం ఐదు ఎమ్మెల్సీ పదవులు అధికార పక్షానికే దక్కడం కూడా తెలిసిందే. అయితే వీటిలో ఒకటి వర్మకు ఇస్తారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇలా ఊరించి.. ఊరించి చివరికి వర్మకు హ్యాండ్ ఇచ్చారు. ఇదేమిని అంటే, 2027లో ఇస్తామిని కొందరి నోళ్లు మూయించారు. నిజానికి వర్మకు ఇవ్వాల్సిన పరిస్థితి. వర్మకి ఎమ్మెల్సీ దక్కకపోవడానికి కారణం పరోక్షంగా డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. కేవలం పవన్ పవర్ తగ్గుతుందనే కారణంతోనే వర్మను పక్కకు పెట్టడం జరిగిందని టీడీపీ సీనియర్ నేతలు అంటున్నారు. ఎవరి కోసమో సొంత పార్టీలోని వ్యక్తులను పక్కకు పెట్టడం ఏంటని టీడీపీ నేతలు నిలదీత వినిపిస్తోంది. తనను గెలిపించిన వర్మను రాజకీయంగా భూ స్థాపితం చేయాలనే పవన్ అడుగులు వేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.