-
యూట్యూబ్ ఛానల్స్ లో ప్రచారాన్ని నమ్మవద్దు
-
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ కింద రూ. 7కోట్ల తో అభివృద్ధి చేస్తున్నాం
-
ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ ఛైర్మన్ అభిషేక్ చందా
భవన నిర్మాణాలకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ లో జరుగుతోన్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ కోరింది. తమ సంస్థపై ఆయా ఛానల్స్ లో జరుగుతోన్న ప్రచారంలో వాస్తం లేదని వాసవి గ్రూప్స్ డైరెక్టర్ అభిషేక్ చందా ఖండించారు. గత 30 ఏళ్ళుగా నిర్మాణం రంగంలో వాసవి సంస్థ ఉందని తెలిపారు. ఈ మూడు దశాబ్ధాల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా చెరువు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు గురువారం హైదరాబాద్ లో ఓ హోటల్ జరిగిన మీడియా సమావేశంలో అభిషేక్ చందా మాట్లాడారు.. తమ కస్టమర్లను ఆందోళనకు గురిచేసే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఆయా యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో చేపడుతున్న వాసవి సరోవర్ ప్రాజెక్టు చిన్న మైసమ్మ చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయని, వాటిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలో ప్రభుత్వ అభ్యర్థన మేరకు కూకట్ పల్లిలోని చిన్న మైసమ్మ చెరువును ను వాసవీ నిర్మాణ సంస్థ దత్తత తీసుకుని రూ. 7 కోట్లతో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చెరువును మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనుల కోసం లేక్ మధ్యలో వేసిన రోడ్డును తాము ఆక్రమించిట్లుగా యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేయడం బాధాకరమని అభిషేక్ చంద్ అన్నారు. ఈ చెరువు అభివృద్ధి పనులు 2027 నాటికల్ల చెరువు అభివృద్ది పనులు పూర్తి అవుతాయని ఆయన చెప్పారు.
అలాగే కోమటికుంట చెరువును కూడా వాసవి నిర్మాణ అభివృద్ది చేస్తుందన్నారు. ఈ రెండు చెరువులు అభివృద్ధి కోసం గతంలోనే ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. చెరువు వద్దకు సులభంగా చేరుకునేదందుకు తమ సంస్థకు చెందిన సుమారు రెండెకరాల భూమిని ప్రభుత్వానికి గిఫ్టు డీడ్ చేయడం జరిగిందన్నారు.
అలాగే మరికొన్ని నిర్మాణ సంస్థలతో కలిసి రాజీవ్ గాంధీ నగర్ కాలనీ ముంపు సమస్యను పరిష్కరించేందుకు రూ.1.20 కోట్ల వ్యయంతో స్ట్రాంగ్ వాటర్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 30 ఏళ్ళుగా తమ వాసవి నిర్మాణ సంస్థ 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టులను, 17 కమర్షియల్ ప్రాజెక్టులు, 310 ఎకరాల్లో విల్లాప్లాట్లు, 4510 అపార్టుమెంట్లను , 20 వేల హ్యాపీ రెసిడెంట్స్ ను నిర్మించిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 8 మిలియన్ చదరపు పీట్ల ఏరియాలో నిర్మాణాలు చేపట్టామని, రానున్న ఐదేండ్లలో 50 మిలియన్ చదరపు పీట్ల ఏరియాలో నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.