Thursday, March 20, 2025

మాజీ ఎంపీ గోరంట్ల‌ మాధ‌వ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు

అత్యాచార బాధితుల పేర్ల‌ను మాధ‌వ్ వెల్ల‌డిస్తున్నారంటూ గోరంట్ల‌ మాధ‌వ్‌పై ఫిర్యాదు
విజ‌య‌వాడ సీపీ రాజశేఖ‌ర్‌బాబుకు ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి ప‌ద్మ

వైఎస్సార్‌సీపీ పార్టీని వీడిన ఏపీ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎంజీ గోరంట్ల మాధవ్‌పై అత్యాచార బాధితుల పేర్ల‌ను మాధ‌వ్ వెల్ల‌డిస్తున్నార‌ని విజ‌య‌వాడ సీపీ రాజశేఖ‌ర్‌బాబుకు ఇచ్చిన త‌న‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అఘాయిత్యానికి గురైన వారి పేర్ల‌ను బ‌య‌ట‌కు చెప్ప‌డం దుర్మార్గ‌మ‌ని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మాధ‌వ్‌పై తగిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. ఇక తాను రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డంపై త‌న నిర్ణ‌యాన్ని వారంలోగా వెల్ల‌డిస్తాన‌ని వాసిరెడ్డి ప‌ద్మ అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com