Saturday, April 26, 2025

వీరమల్లా…పోలవరమా…?

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లుకు మోక్షం ఎప్పుడు ? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్‌ మీడియా అంతటా రచ్చ లేపుతోంది. ఈ సినిమాను బహుశా ఇప్పుడు పవన్ అభిమానులే మర్చిపోయారనుకుంటా.. ఏళ్లకుఏళ్లుగా షూటింగ్ సాగుతూనే ఉంది. డైరెక్టర్స్ మారుతూనే ఉన్నారు. కానీ సినిమా మాత్రం పూర్తి కాలేదు. మెగా ఫ్యాన్స్ లైఫ్ లో ఈ సినిమా రిలీజ్ ఓ పీడకలగానే మిగిలిపోతుందేమోనని వాపోతున్నారు. మొన్నటి దాకా ‘హరి హర వీరమల్లు’రిలీజ్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. మే 9న రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. తమ అభిమాన హీరోని తొలిసారి చారిత్రాత్మక వేషంలో చూడాలని సగటు పవన్ అభిమాని కల. కానీ ఈ సినిమా మరోసారి వాయిదా అంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. ఇప్పటికే 11 సార్లు ఈ సినిమా వాయిదా పడింది. దీంతో రిలీజ్ కు ముందే అత్యధిక సార్లు వాయిదా పడ్డ సినిమాగా ‘హరి హర వీరమల్లు’ చరిత్రలో నిలిచింది. దీంతో ఈ సినిమాకు మోక్షం ఎప్పుడోనని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పోలవరం ప్రాజెక్ట్ ను ఈ సినిమాకు లింక్ పెడుతూ పోస్టులు పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అవుతుందని ‘హరి హర వీరమల్లు’ మాత్రం అక్కడే ఉంటుందని ట్రోలింగ్ చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com