పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ కూడా ఒకటి. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వాయిదా విషయంలో ఇప్పటికే రికార్డు కొట్టింది ఈ మూవీ. దాదాపు 12 సార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేస్తూ వచ్చారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఆదివారం రోజు హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు రోజుల షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారని తెలిపింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న, ఎక్స్‌ప్లోజివ్ ట్రైలర్, ఎలక్ట్రిఫైయింగ్ పాటల కోసం సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు మూవీ యూనిట్. తుఫానుకు కౌంట్‌డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది అని పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్, బాబీ డియోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త నటిస్తున్నారు.