తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ మొదలైంది. సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు ఉభయసభల ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కులగణన రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, కులసర్వే నివేదిక సమగ్ర ఇంటింటి కులసర్వే నిర్వహించాలని 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు.
కర్నాటక, బిహార్ సహా వివిధ సర్వేలను అధ్యయనం చేశామని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సర్వే చేపట్టామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సర్వేను నిర్వహించామన్నారు. సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామని.. 75 అంశాల ప్రాతిపదికగా సర్వేను నిర్వహించామని చెప్పారు. నవంబర్ 9 నుంచి 50 రోజుల పాటు సర్వే నిర్వహణ జరిగిందని రేవంత్ రెడ్డి తెలిపారు.