విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ 75 వ చిత్రం ‘సైంధవ్’ వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున టీమ్ ప్రమోషన్స్ లో మరింత దూకుడు పెంచిది. ఈ రోజు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
పాప డ్యాన్స్ చేస్తూ తన తండ్రిని అనుకరిస్తూ చాలా ప్లజెంట్ గా ట్రైలర్ ప్రారంభమైయింది ఓపెనింగ్ సీక్వెన్స్ తండ్రీ కూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఎస్టాబ్లిష్ అయ్యింది. తండ్రికి తన కూతురే సర్వస్వం. కూతురుకి తండ్రి సూపర్‌హీరో. దురదృష్టవశాత్తు, ఆమెకు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. వ్యాధిని నయం చేసే ఇంజక్షన్ ధర 17 కోట్లు. దీంతో కథానాయకుడు తన పాత స్నేహితులను, ప్రత్యర్థులను తిరిగి కలవాలని నిర్ణయించుకుంటాడు. అతని గతం ఏమిటి? ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ మొదలైన బ్యాచ్‌తో అతనికి వున్న వైలెంట్ గతం ఏమిటి?
సినిమా కథాంశాన్ని గోప్యంగా ఉంచిన దర్శకుడు శైలేష్ కొలను ఎట్టకేలకు ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. ట్రైలర్‌ని బట్టి చూస్తే పాప సినిమాకి సోల్. తన కుమార్తె కోసం శాంతి మార్గంలో నడవాలని ఎంచుకున్న తండ్రి ఆమె కోసం హింసాత్మక మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దర్శకుడు కథలో రెండు ఆపోజిట్ లేయర్స్ ని మిళితం చేశాడు. ఇది ఫ్యామిలీస్ తో పాటు యాక్షన్, థ్రిల్లర్ సినిమా ప్రేమికులకు నచ్చేలా చేసింది. సైకోగా వెంకటేష్ ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ క్లాస్, మాస్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అతను సాధారణ మధ్యతరగతి తండ్రిగా కనిపించినప్పటికీ, తన శత్రువులతో పోరాడినప్పుడు వైల్డ్ గా కనిపించారు. వెంకటేష్ తన శైలిలో హెచ్చరించిన చివరి రెండు ఎపిసోడ్‌లు బ్యాంగ్-ఆన్‌గా ఉన్నాయి. బేబీ సారాతో అతని బంధం ఒక ప్రధాన ఆకర్షణ, బేబీసారా తన నటనతో ఆకట్టుకుంది. శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా తమ పాత్రలతో అలరించారు.
దర్శకుడు నటీనటుల నుండి మాత్రమే కాకుండా సాంకేతిక నిపుణుల నుండి కూడా బెస్ట్ వర్క్ ని రాబట్టుకున్నారు. ఎస్.మణికందన్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఇది సినిమా వెన్నెముక అని చెప్పాలి. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ అన్నీ లావిష్‌గా ఉన్నాయి. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ టాప్ క్లాస్ లో వుంది. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది.ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా భరోసానిచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మీ అందరి సమక్షంలో ట్రైలర్ లాంచ్ చేయడం చాలా అనందంగా వుంది. ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ అందరి ప్రేమ అభిమానాలు ప్రోత్సాహం కావాలి. 75వ చిత్రంగా ‘సైంధవ్’ లాంటి సినిమా చేయడం అదృష్టంగా బావిస్తున్నాను. దర్శకుడు, డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్ మా టీం అంత అద్భుతంగా వర్క్ చేశారు. మా నిర్మాతలు సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్ చేయాలని ఎప్పటి నుంచో వుండేది. ‘సైంధవ్’ మంచి ఎమోషన్ తో న్యూ ఏజ్ యాక్షన్ తో ఫాస్ట్ పేస్డ్ ఫిలిం. తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. 15 నిమిషం నుంచే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్ అవుతారు. సైంధవ్ ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ‘సైంధవ్’ నా కెరీర్ లో ఒక బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి రియల్ ట్రీట్. తప్పకుండా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
డైరెక్టర్ శైలేష్ కొలను .. వెంకటేష్ 75వ చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేష్ గారికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు. నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు. ట్రైలర్ లో కథ చెప్పేశాను. ఇంత ధైర్యంగా కథ చెప్పానంటే సినిమా లోపల ఎంత వుందో మీ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాను. వెంకీ గారు నాలుగు అడుగులు వేస్తేనే ఆడియన్స్ అరుస్తున్నారు. థియేటర్ లో ఇంకేం చేస్తారేమో అని భయం వేస్తుంది(నవ్వుతూ). వెంకటేష్ గారు నాకు చాలా స్ఫూర్తిని ఇచ్చారు. ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్ మేకింగ్ అంతా వాడేశాను. హాలీవుడ్ లో ఈక్వైలైజర్, టేకెన్ లాంటి సినిమాలు చూస్తున్నపుడు మన తెలుగులో కూడా ఆ ఏజ్ గ్రూప్ హీరోలు ఆ తరహ సినిమాలు చేస్తే యంగర్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కదా అనిపించేది. అలాంటి సమయంలో వెంకీ గారు పిలిచి ఈ అవకాశం ఇచ్చారు. వెంకటేష్ గారు ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. తప్పకుండా అందరూ సినిమా చూడండి. వెంకీ 75వ చిత్రాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకట్ గారు ధన్యవాదాలు. మా టీం అందరికీ థాంక్స్. వెంకీ మామ సినిమా అంటేనే పండగ. ఈ పండక్కి అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’ అని కోరారు.
నిర్మాత వెంకట్ బోయనపల్లి.. వెంకటేష్ అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. వెంకటేష్ గారు లాంటి పెద్ద స్టార్ తో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. వెంకటేష్ గారు మా స్ఫూర్తి. ఆయనతో సినిమా చేయడం కల నేరవేరినట్లయింది. అందరూ జనవరి 13న సినిమా చూడండి. సినిమా విందు భోజనంలా వుంటుంది’’ అన్నారు. ఈ వేడుకలో గెటప్ శ్రీను, చైతన్యతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.