Monday, May 12, 2025

బిగ్ బాస్ హౌజ్ లోకి వేణు స్వామి..

స్వామి ఎంట్రీతో హౌజ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్

ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో 8 వ సీజన్ అతి త్వరలోనే మొదలవబోతోంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

దీంతో ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న పేర్లలో పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ ఫ్లూయెన్సర్లు ఉన్నారు.

ఇక ఈసారి బిగ్ బాస్‌ హైజ్ లోకి వేణు స్వామి కంటెస్టెంట్‌ గా వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రముఖులు, సినీ-రాజకీయ నాయకులు జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక వేణు స్వామి మనసులో ఏదీ దాచుకోకుండా.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంటాడు.

బిగ్ బాస్ షోకు కావాల్సింది కూడా ఇదే కదా మరి. ఇలాంటి ముక్కుసూటింగా మాట్లాడే వ్యక్తుల వల్ల బిగ్ బాస్ కు అవసరమైన కంటెంట్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే వేణు స్వామిని బిగ్ బాస్ హౌజ్‌లోకి రప్పించేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com