Friday, December 27, 2024

అక్టోబర్‌లో రజినీకాంత్ ‘వేట్టయాన్’

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా రాబోతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో రజినీ స్టైల్, ఆ నవ్వు, ఆ గన్ను పట్టిన విధానం, ఆ హెయిర్ స్టైల్ అన్నీ కూడా అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించడంతో దసరా పోటీ రసవత్తరంగా మారేట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com