Monday, March 31, 2025

విచారణ చేస్తాం

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి.. ఈ నెల 10కి విచారణ వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.
కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని వేసిన మొదటి పిటిషన్‌తో పాటు రెండో పిటిషన్‌ను విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 10న మొదటి పిటిషన్ విచారణతో పాటు రెండో పిటిషన్‌పై విచారణ చేస్తామని తాజా పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

అన్నీ విచారణ చేస్తాం
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్‌ఎస్ తరపున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్‌కు కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను జతచేసింది ధర్మాసనం. కేటీఆర్‌ వేసిన పిటిషన్‌ను.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లా వెంకట్రావు అనర్హత పిటిషన్‌తో కలిపి వీటిని విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల10న పాత పిటిషన్‌తో కలిపి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడిస్తూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది.
కాగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్‌పై రెండు రోజుల క్రితం సుప్రీంలో విచారణ జరుగగా.. సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ స్పీకర్‌‌పై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో తెలంగాణ స్పీకర్ ఆలస్యం చేయడంపై సుప్రీం స్పందిస్తూ.. ఇంకా ఎంత సమయం కావాలంటూ గత విచారణలో ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా అంటూ సుప్రీం ప్రశ్నించింది. స్పీకర్‌కు ఎంత సమయం కావాలో మీరే కనుక్కుని చెప్పాలంటూ న్యాయవాది ముకుల్ రోహత్గీకి ధర్మాసనం ఆదేశించింది. ఆపై తదుపరి విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com