సోమేష్‌కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ చీఫ్ సీరియస్
కాళేశ్వరం కమిషన్ విచారణ హీటెక్కింది. విచారణకు స్మిత సబర్వాల్, సోమేష్ కుమార్ హాజరయ్యారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. పిలిచిన వెంటనే విచారణ హాల్లోకి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో సంబంధం ఉన్న అధికారులు అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అఫిడవిట్ తీసుకున్న కమిషన్ చైర్మన్… ఇప్పుడు వారిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. అయితే మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. పిలిచిన వెంటనే విచారణ హాల్లోకి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు.
సీఎస్‌గా.. మీరేం చేశారు..?
ఆ తరువాత బ్యారేజ్‌లకు సంబంధించి అనుమతుల విషయంలో ప్రశ్నలు సంధించారు. మూడు బ్యారేజీల విషయంలో సీఎస్, ఇరిగేషన్ సెక్రెటరీగా ఉన్నప్పుడు ఏమైనా డీల్ చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఇరిగేషన్ సెక్రెటరీగా కొద్ది కాలమే ఉన్నానని.. చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్లానని సోమేష్ కుమార్ చెప్పారు. సీఎస్‌గా ఉండి ఏ నిర్ణయమైనా కేబినెట్ అనుమతి ప్రకారమే తీసుకుంటాను అనడం కరెక్టా అని.. నిబంధనలకు వ్యతిరేకంగా మూడు బ్యారేజీల నిర్మాణాలు జరిగినట్లు ఏమైనా నోట్స్ గుర్తించారా అని కమిషన్ ప్రశ్నించింది. అయితే, కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు మాజీ సీఎస్ సూటిగా సమాధానం చెప్పలేదు. దీంతో సూటిగా సమాధానం చెప్పకపోవడంతో మాజీ సీఎస్‌పై కమిషన్ చీఫ్ సీరియస్ అయ్యారు. అడిగే ప్రశ్నలకు సూటిగా మాత్రమే సమాధానాలు చెప్పాలని సోమేశ్ కుమార్‌ను ఘోష్ హెచ్చరించారు. ‘‘కమిషన్ ముందు హాజరయ్యారు… డిబేట్‌కు రాలేదు అడిగిన ప్రశ్నకు స్ట్రెయిట్ ఆన్సర్ ఇవ్వాలి’’ అంటూ కమిషన్ చురకలంటించింది. సీఎస్‌గా ఉన్నప్పుడు మూడు బ్యారేజీల విషయంలో ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తించారా అని కమిషన్ చీఫ్ అడగా.. కమీషన్ అడిగిన ప్రశ్నలకు గుర్తుకులేదు, మర్చిపోయాను, చాలా సంవత్సరాలు అయింది అని సోమేశ్ కుమార్ సమాధానం చెప్పారు.
నా పాత్ర లిమిటడే: స్మిత
అంతకుముందు ఐఏఎస్ అధికారిని స్మితను కమిషన్ బహిరంగంగా విచారించింది. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్‌లో నిర్మాణం, అనుమతులపై స్మితాను ఘోష్ ప్రశ్నించారు. కేబినెట్ అనుమతి లేకుండానే జీఓలు వచ్చాయా అని స్మితను ప్రశ్నించగా.. తనకు తెలియదని స్మితా సబర్వాల్ సమాధానం ఇచ్చారు. ఆనాడు సీఎంవోల పనిచేసినప్పటికీ తన పాత్ర లిమిటెడ్‌నే అని చెప్పుకొచ్చారు. ఆనాడు నిర్మాణ సమయంలో తప్పిదాలు జరిగితే అందుకు సంబంధించిన సమాచారాన్ని సీఎంకు ఇవ్వడమే తన పని అని తెలిపారు. ఎక్కడైతే ప్రాజెక్టులు, బ్యారేజ్‌ల నిర్మాణం జరిగిందో ఆయా జిల్లాలకు కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకోవడం, సమాచారం సేకరించడం.. సీఎంవో నుంచి సమాచారాన్ని కలెక్టర్లకు చేరవేయడం మాత్రమే తన విధి అని తెలిపారు. తన రోల్ చాలా లిమిటెడ్ మాత్ర అనే సమాధానాన్ని కమిషన్‌కు స్మిత సబర్వాల్ చెప్పారు.