Tuesday, May 6, 2025

విద్యార్ధులను విమానం ఎక్కించిన టీచర్‌

పిల్లలు చదువుకోవాలంటే ఇంట్లో తల్లిదండ్రులు, గురువులు చాలా మంది చాలా చెబుతుంటారు. చాలా హామీలు ఇస్తుంటారు. నీకు అది చేస్తా .. ఇది చేస్తా అంటూ కానీ మొదటి సారి ఓ ఉపాధ్యాయుడు తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. ఓ ఉపాధ్యాయుడు చేసిన పనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించేందుకు మండల స్థాయిలో ఫస్టు వస్తే విమానం ఎక్కిస్తానని ఉపాధ్యాయుడు హామీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు మండల స్థాయిలో టాపర్లుగా నిలవడంతో తాజాగా ఆ ఉపాధ్యాయుడు తన హామీని నిలబెట్టుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సొంత ఖర్చుతో విమానం ఎక్కించారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరడాన సత్యారావు తన విద్యార్థులకు ఈ బహుమతి ఇచ్చారు.
గత నెల 23న వెలువడిన పదో తరగతి ఫలితాల్లో గర్భాం, భైరిపురం పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎస్‌.వివేక్‌ (593), టి.రేవంత్‌ (591) మండల స్థాయిలో ఫస్ట్, సెకండ్ ర్యాంకర్లుగా నిలిచారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో సత్యారావు ఆదివారం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను రైలులో విజయవాడకు తీసుకువెళ్లారు. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో విశాఖపట్నంకు ప్రయాణించారు. అక్కడి నుంచి బస్సులో విజయనగరం తిరిగి వచ్చారు. కాగా, విద్యార్థులను ప్రోత్సహించడానికి సత్యారావు చేసిన పనికి జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్, అధికారులు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

 

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com