Tuesday, April 22, 2025

విడిపోవడానికి అసలు కారణం ఇదేనా?

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత. ఈ భామ నాగచైతన్యను వివాహం చేసుకుని కొన్ని అపార్ధాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ళు కలిసి ఉన్న ఈ జంట సడెన్‌గా విడిపోతున్నట్లు అనౌన్స్‌ చేశారు. వీరిద్దరూ విడిపోయిన అనంతరం నాగచైతన్య శోభితను వివాహం చేసుకున్నారు. ఇక సమంత కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. సిటాడెల్‌ డైరెక్టర్‌ రాజు నిడుమోరునే తాను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియా అంతా కోడై కూస్తుంది. రాజ్‌నిడుమోరు త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఈ జంట కలిసి దర్శనం ఇస్తున్నారు. ఇటీవలె సమంత తిరుమలకు వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇదిలా ఉంటే సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌కు లైక్ కొట్టారు. ఆ పోస్ట్ లో ఏముందంటే.. భార్యలు తీవ్రమైన అనారోగ్యానికి గురైతే.. భర్తలు వారిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సర్వేలో తేలిందట. భార్యలు ప్రాణాంతకమైన అనారోగ్యానికి గురైతే 21 శాతం మంది భర్తలు వారి నుంచి విడిపోతున్నారట. అదే భర్తలు ప్రాణాంతకమైన వ్యాధికి గురైతే భార్యలు విడిపోవాలనుకునే శాతం 2.9 శాతం మాత్రమే అని సర్వేలో తేలిందట. భార్యలు అనారోగ్యంతో ఉంటే వారి నుంచి విడిపోవాలనుకునే భర్తలు ఎక్కువ. కానీ భర్తలు అనారోగ్యంతో ఉంటే వారితో కలసి జీవించే భార్యలు ఎక్కువ అని తేలింది.ఈ పోస్ట్‌ను సమంత లైక్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సమంత రెండో పెళ్లికి రెడీ అవుతుందనే చర్చ సాగుతుంది. విడాకుల అనంతరం సమంత అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తన ఆరోగ్యం గురించి అన్ని తెలిసిన వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి చైతూ సమంత ఆరోగ్యం గురించి ముందుగానే తెలిసి ఇలా చేశాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఆరోగ్యం సరిగాలేకపోతే భార్యలను భర్తలు వదిలేస్తారా అని సోషల్‌ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com