Sunday, March 9, 2025

డిసెంబర్ 20న “విడుదల 2”

దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన “విడుదల 1” థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “విడుదల 2” సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన “విడుదల 2” రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

“విడుదల” సినిమాతో చూస్తే మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా “విడుదల 2” సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు వెట్రిమారన్. మహారాజ మూవీ తర్వాత విజయ్ సేతుపతి నటించిన సినిమాగా “విడుదల 2″పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం “విడుదల 2” మూవీకి మరో ఆకర్షణ కానుంది. భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ లాంటి ప్రతిభావంతమైన నటీనటులు “విడుదల 2″లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com