Friday, April 4, 2025

Casting Call movie: కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసిన హీరో విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 ఇటీవలే అనౌన్స్ అయ్యింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 నుంచి ఈ రోజు కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు.

ఔత్సాహిక నటీనటులను ఎంపిక చేసి వీడీ 14లో నటించే అవకాశం కల్పించనున్నారు. తిరుపతి, అనంతపురం, కడప, కర్నూల్ లో జూలై 1వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరగనున్నాయి. ఈ సినిమా షూటింగ్ మొత్తం రాయలసీమలోనే జరగనుంది. నటనలో ప్రతిభ గల కొత్త టాలెంట్ కు ఇది గొప్ప అ‌వకాశం అని చెప్పుకోవచ్చు.

ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు రాహుల్ సంకృత్యన్. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది.

‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్సీపీరియన్స్ ఇవ్వనుందీ సినిమా. త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com