Sunday, September 29, 2024

లిక్కర్ డాన్ విజయ్‌ మాల్యా కుమారుడి వివాహ వేడుకలు

* లిక్కర్ డాన్ విజయ్‌ మాల్యా కుమారుడి వివాహ వేడుకలు
* లండన్ లో వారం రోజుల పాటు పెళ్లి సంబరాలు
మీకు లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా గుర్తున్నాడు కదా. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని, ఆ తరువాత లండన్ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. కింగ్ ఫిషర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో ఓ వెలుగు వెలిగిన విజయ్ మాల్యా.. ఆ తరువాత బ్యంకు అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి సంచలనం సృష్టించాడు. ఇదిగో ఇప్పుడు విజయా మాల్యా కొడుకు పెళ్లి వార్తతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. విజయ్ మాల్య తనయుడు సిధ్దార్ద్ మాల్యా వివాహ వేడుకలు లండన్‌ లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈవిషయాన్ని సిద్ధార్థ్‌ మాల్యా స్వయంగా సోషల్ మీడియా ద్వార తెలియజేశాడు.
ఈ సందర్భంగా ఫ్లవర్‌ ఫ్రేమ్‌ లో తన ప్రియురాలు జాస్మిన్‌ తో దిగిన ఫొటోను షేర్‌ చేశాడు సిధ్దార్ధ్ మాల్యా. 2023లో జరిగిన హాలోవిన్‌ సంబరాల్లో జాస్మిన్‌ కు ప్రపోజ్‌ చేశాడు సిధ్దార్ధ్. ఆమె కూడా అంగీకరించడంతో అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. సిద్ధార్థ్‌ మాల్యా గతంలో నటుడానే కాకుండా మోడల్‌గా పనిచేశాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జన్మించిన సిధ్దార్ధ్ మాల్యా.. వెల్లింగ్టన్‌ కాలేజ్‌, క్వీన్స్‌మేరీ యీనివర్సిటీల్లో చదువుకొన్నాడు. రాయల్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ డ్రామాలో ట్రైనింగ్ తీసుకున్నాడు.
కేరీర్ ప్రారంభంలో మోడల్‌, నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన సిధ్దార్ధ్ మాల్యా.. మానసిక ఆరోగ్యంపై పుస్తకాలు సైతం రాశాడు. మరీ ముఖ్యంగా యువతలో వచ్చే మానసిక సమస్యలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాడు. అంతే కాకుండా గయ సంవత్సరం తాను జీవితంలో అనుభవించిన మానసిక పరిస్థితిపై కూడా ఓ పుస్తకం రాశాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు గతంలో డైరెక్టర్‌గా పనిచేశాడు. మొత్తానికి విజయ్ మాల్యా తనయుడు పెళ్లి లండన్ లోనే కాదు భారత్ లోను ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular