-
కిషన్ రెడ్డి అభిప్రాయం తప్పు
-
తెలంగాణలో బీఆర్ఎస్పార్టీ ఉంటుంది
-
కాంగ్రెస్ నేత విజయశాంతి ఆసక్తికర ట్వీట్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత విజయశాంతి ఆసక్తికరంగా స్పందించారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని ఆమె అన్నారు. ఆత్మగౌరవం, పోరాటతత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమని ఆమె వ్యాఖ్యానించారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందని రాములమ్మ విమర్శించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా విజయశాంతి స్పందించారు.
ట్వీట్ ఇదే
‘‘తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి.. దక్షిణాది… దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం… ఎన్నడైనా.. వాస్తవం…ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి ప్రకటన భావం’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.