Sunday, January 5, 2025

విజయ నెయ్యితోనే లడ్డూలు

ఆలయ ఈవోలకు దేవాదాయశాఖ ఆదేశాలు

రాష్ట్ర దేవాదాయ శాఖ ఈవోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నెయ్యిని యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని ఆలయాలు వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసి జనవరి 1వ తేదీ నుంచి ఉపయోగించాలని తెలిపింది. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాలు అప్పటి నుంచి నెయ్యి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరీ నెయ్యిని రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలని రద్దు చేయాలని తెలిపింది.

నెయ్యి టెండర్ల వివాదంతో..!
జనవరి 1వ తేదీ నుంచి యాదగిరిగుట్టతో పాటు పలు ఆలయాలు ఈ నెయ్యి వాడకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి టెండర్ల విషయంలో వివాదం అయ్యింది. దీంతో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ చాలా ఆలయాల్లో పాత గుత్తేదారుల నుంచే నెయ్యిని తీసుకుంటున్నారట. అందులోనూ ప్రైవేట్ డెయిరీలనే ఎక్కువగా వాడుతున్నారు. దీంతో దేవాదాయ శాఖ కేవలం విజయ నెయ్యినే అన్ని ఆలయాలు వాడాలని ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ఆలయాలు నెయ్యి సరఫరాని వచ్చే ఏడాది మార్చి వరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ప్రభుత్వం వాటిని ముడు నెలలకు ముందే రద్దు చేస్తూ.. జనవరి 1 నుంచి అన్ని ఆలయాలు విజయ డెయిరీ నెయ్యిని ఉపయోగించాలని తెలిపింది. సమయం ఉండగానే ఒప్పందాలను ఇలా రద్దు చేయడం కరెక్ట్ కాదని.. రెండు డెయిరీలు కూడా 50-50 శాతం సరఫరా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com