Friday, November 15, 2024

సెప్టెంబర్ 2నుంచి విజయవాడ వెళ్ళే పలు రైళ్లు రద్దు

దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే అన్ని డివిజన్ల పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు చేపట్టింది. దీనిలో భాగంగా విజయవాడ డివిజన్ లో కూడా పనులు జరుగుతుండటంతో వచ్చేనెల రెండోతేదీ నుంచి 29వ తేదీ వరకు డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు.

మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రయాణికులు సహకరించాలని విజయవాడ డివిజన్ అధికారులు కోరారు.

విజయవాడ, రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దయిన రైళ్లు

మచిలీపట్నం-విజయవాడ (07896)

విజయవాడ-మచిలీపట్నం (07769),

నర్సాపూర్‌-విజయవాడ (07863),

విజయవాడ-మచిలీపట్నం (07866),

మచిలీపట్నం-విజయవాడ (07770),

విజయవాడ-భీమవరం జంక్షన్ (07283),

మచిలీపట్నం-విజయవాడ (07870),

విజయవాడ-నర్సాపూర్‌ (07861)

గుణదల, భీమవరం, నిడదవోలు మీదుగా దారి మళ్లించిన రైళ్ల వివరాలు

సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో ఎర్నాకుళం – పాట్నా (22643)

సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో భావ్ నగర్ – కాకినాడపోర్ట్‌ (12756)

సెప్టెంబరు 4, 6, 11, 13, 18, 20, 25, 27 తేదీల్లో బెంగళూరు – గౌహతి (12509) రైళ్లను దారి మళ్లించారు.

సెప్టెంబరు 2, 4, 6, 7, 9, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ – భువనేశ్వర్‌ (11019)

సెప్టెంబరు 2 నుంచి 29వరకు ధన్‌బాద్ – అలెప్పి (13351)

సెప్టెంబరు 5, 12, 19, 26తేదీల్లో టాటా – యశ్వంత్‌పూర్‌ (18111)

సెప్టెంబరు 4, 11, 18, 25 తేదీల్లో జసిధి(జార్కండ్) – తాంబరం (12376)

సెప్టెంబరు 2, 9, 16, 23 తేదీల్లో హాతియా – ఎర్నాకుళం (22837)

సెప్టెంబరు 7, 14, 21, 28 తేదీల్లో హాతియా – బెంగళూరు (18637)

సెప్టెంబరు 3, 8, 10, 15, 17, 22, 24, 29 తేదీల్లో హాతియా – బెంగళూరు (12835)

సెప్టెంబరు 6, 13, 20, 27 తేదీల్లో టాటా – హాతియా (12889)

ఈ తేదీల్లో ప్రయాణికులు దారి మళ్లించిన రైళ్ల మార్గాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. విజయవాడ-గూడూరు డివిజన్ మధ్య, విజయవాడ-విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైను నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఆయా మార్గాల్లో కూడా కొన్నింటిని అధికారులు రద్దు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో కొన్నింటిని పునరుద్ధరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular