Saturday, April 5, 2025

బాలీవుడ్‌పై రౌడీ హీరో ఇలాంటి విమర్శలా?

గత చిత్రాలతో పోల్చుకుంటే బాలీవుడ్‌ నుంచి ఈ మధ్య వచ్చే చిత్రాలు పెద్దగా హిట్‌ అవ్వడం లేదు. స్టార్‌ హీరోలు కూడా హిట్లు కొట్టలేక సతమతమవుతున్నారు. ఇక సౌత్‌ సినిమాలు వచ్చే సరికి బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపేస్తున్నాయి. దీంతో సొంత ఇండస్ట్రీ వాళ్ళే అసహం వెళ్ళగక్కుతున్నారు.

తాజాగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందులను ఎదుర్కొంటోందని… త్వరలోనే పూర్వ వైభవాన్ని సాధిస్తుందని చెప్పారు. దక్షిణాది సినిమాలకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో మంది శ్రమ, కృషి ఉందని చెప్పారు.

బాలీవుడ్‌ ప్రేక్షకులు ఇప్పుడు మన సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని… ఒకానొక సమయంలో మన సినిమాలకు బాలీవుడ్‌లో సరైన గుర్తింపు ఉండేది కాదని అన్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు ఒక లోటు ఏర్పడిందని… ఆ లోటును కొత్త దర్శకులు తీరుస్తారని చెప్పారు. కాకపోతే ఆ దర్శకులు ముంబైకి సంబంధం లేకుండా బయటివారే అయి ఉంటారని అనిపిస్తోందని అన్నారు. అంటే దీన్ని బట్టి రౌడీ హీరో బాలీవుడ్‌ దర్శకులకు కామెంట్లు విసరకనే విసిరారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com