Thursday, December 26, 2024

విజయ్‌తో రష్మిక డేటింగ్‌…మరి పెళ్ళెప్పుడంటే?

రష్మిక మందన్న గతేడాది యానిమల్‌, ఇప్పుడు పుష్ప 2 చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు ఈ కన్నడ కస్తూరి. హీరోయిన్స్‌ని స్కిన్ షో, అందాల ఆరబోతకి మాత్రమే వాడుకుంటున్న ఈ రోజుల్లో మంచి ప్రాధాన్యత గల పాత్రలు దక్కించుకుని నటిగానూ తనకు తిరుగులేదని నిరూపించారు. తద్వారా ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా నిలిచారు రష్మిక కిరాక్ పార్టీతో సినీరంగ ప్రవేశం చేసి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు రష్మిక మందన్న. చిత్ర సీమలో వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు నేషనల్ క్రష్‌గా ఎదిగారు. చలో, గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలు రష్మిక కెరీర్‌కు బలమైన పునాదులు వేశాయి. తెలుగులో టాలెంట్ నిరూపించుకున్న రష్మికకు.. బాలీవుడ్‌లో అవకాశాలు క్యూకట్టాయి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో నటించి ఆమె కెరీర్‌కు గతేడాది రిలీజైన యానిమల్‌ బూస్టప్ ఇచ్చింది. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలుకొట్టే దిశగా పుష్ప 2 సాగుతోంది. పాన్ ఇండియా ఫార్మాట్‌లో తెరకెక్కుతోన్న కుబేరతోపాటు హిందీలో చావా, సికిందర్, థమ, ది గర్ల్ ఫ్రెండ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో రష్మిక మందన్న నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా ఆమె కదులుతున్నారు. కెరీర్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న రష్మిక.. పర్సనల్‌గానూ స్ట్రాంగ్. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. పలుమార్లు వీరిద్దరూ జంటగా కనిపించగా.. ఇటీవల ఓ రెస్టారెంట్‌లోనూ దొరికిపోయారు. మీడియాలో ఎన్నో గాసిప్స్ వస్తున్నా.. వీరిద్దరూ మాత్రం తమ బంధాన్ని బయటపెట్టడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్న ప్రేమ, పెళ్లి, వైవాహిక బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన కష్ట, సుఖాల్లో అన్ని దశల్లోనూ భాగస్వామి తోడుగా ఉండాలని పేర్కొన్నారు. ఒకరికొకరు గౌరవించుకోవాలని.. కాబోయే భర్తది మంచి మనసై ఉండాలని రష్మిక పేర్కొన్నారు. ప్రేమలో ఉండటమంటే మంచి భాగస్వామిని కలిగి ఉండటమేనని.. జీవితంలో ఒక తోడు ఉండాలని, లేదంటే లైఫ్‌కే అర్ధం లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారా లేదా అని ఫ్యాన్స్‌ చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్నిసార్లు వీరిద్దరూ ఫ్రెండ్స్‌ అంటారు మరికొన్నిసార్లు లవర్స్‌ అని ఈ రూమర్స్‌ అన్నిటికి మరి ఎప్పుడు జవాబు చెబుతారో వారికే తెలియాలి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com