అక్రమ కలప కోసం ఇళ్లల్లో సోదాలు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో అక్రమ కలప కోసం అటవీ సిబ్బంది చేపట్టిన సోదాలు ఉద్రిక్తలకు దారి తీసింది. ఇటీవల కలపను అక్రమంగా నిల్వ చేశారనే సమాచారంతో ఇళ్లలో సోదాలు చేస్తున్న అటవీ సిబ్బందిపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. దాడిలో అటవీ శాఖ వాహనం ధ్వంసం అయింది.
ఇటీవల సిబ్బందికి అందిన సమాచారంతో అటవీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అందులో కొన్ని కలప దుంగలను స్వాధీనం చేసుకున్న సిబ్బంది, ఇంకా అక్రమంగా మిగిలిన కలప ఉందనే ఆలోచనతో సోదా చేయటం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. గ్రామస్థులు కొంతమంది రాళ్లు రువ్వగా, అటవీ సిబ్బంది భయంతో పరుగు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేశవపట్నం చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.