- మైలారం గ్రామంలో ఆందోళనకు దిగిన స్థానికులు
- ఆందోళనకారుల అరెస్ట్‌తో ఉద్రిక్తత
- ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు పలువురి అరెస్టు
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మైనింగ్ కు వ్యతిరేకంగా రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సన్నద్ధమయ్యారు. దీంతో పోలీసులు ముందస్తుగా పలువురు రైతులు, స్థానికులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు పెద్ద ఎత్తున మహిళలు, రైతులు రోడ్డుపైకి చేరి నిరసనకు దిగారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన ఉధృతం చేశారు.
గ్రామంలోనికి పోలీసులను రానీయకుండా ముళ్లకంచెలు వేశారు.
ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు పలువురి అరెస్టు
పోలీసులు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు పోలీసులను ఊరిలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు. ముళ్ల కంపలు వేసి మహిళలు, గ్రామస్తులు నిరసన తెలిపారు. పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఓ మహిళ సృహతప్పి పడిపోయింది. మైలారం గ్రామస్తులకు, రైతులకు మద్దతు తెలిపినందుకు ప్రొఫెసర్ హరగోపాల్ పలు సంఘాల నాయకు లతో కలిసి వెళ్లగా పోలీసులు వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కాగా, మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రతిపక్షాలకు వారధిలా ఉన్న హరగోపాల్ వంటి వ్యక్తులను అరెస్ట్ చేయడాన్ని యావత్ ప్రజానీకం ఖండించింది.