Friday, May 16, 2025

చంచల్​ గూడ జైలులో వీఐపీ బరాక్​..? రాష్ట్రంలో కీలక చర్చ

టీఎస్​, న్యూస్​ :రాష్ట్రంలో తాజాగా ఒక ప్రచారం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. “ చంచల్‌గూడ జైల్లో వీఐపీ బరాక్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ” అంటూ వైరల్​అవుతున్నది.
గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు కీలక, ముఖ్య నేతల కోసం చంచల్ గూడ జైల్ లోని వీఐపీ బరాక్ ను కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలు అధికారులు సిద్ధం చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఇదే కేసులో ఒక ఐపీఎస్ మరో ముగ్గురు సీనియర్ అధికారులు అరెస్ట్ కావడం, వారంతా చంచల్​గూడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే‌‌‌. ఈ కేసులో బీఆర్ఎస్​ ప్రభుత్వం హయాంలోని ఓ కీలక మంత్రి, మరో ఎంపీ, ఎమ్మెల్సీ కూడా ఉన్నారని అనుమానాలున్నాయి. ఈ కేసులో ప్రముఖుల పాత్ర తేలాలంటే ఏ1గా ఉన్న ప్రభాకర్​రావు విచారణ తర్వాతే తెలుస్తుంది. విదేశాల్లో ఉన్న ఆయనను హైదరాబాద్​కు రప్పించి, విచారించేందుకు సిట్​ పోలీసులు ఇప్పటికే లుక్​ అవుట్​ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే దేశంలోనే తొలి కేసుగా టెలిగ్రాఫ్​ కేసు కూడా నమోదు చేసేందుకు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ పరిణామాల్లోనే త్వరలోనే వీఐపీలు అరెస్ట్​ అవుతారని, అందుకే చంచల్​గూడ జైలులో వీఐపీ బరాక్​ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com