Sunday, April 20, 2025

విశాఖ లైట్‌ హౌస్‌ను కూల్చేస్తారా?

వైజాగ్‌ అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది లైట్‌ హౌస్‌. దాదాపుగా ఆరు దశాబ్దాల పాటు ఈ లైట్ హౌస్ ఎనలేని సేవలను అందించింది. 1903లో లైట్ హౌస్ ను నిర్మించారు. 1962లో అది సేవలకు దూరమయింది. విదేశాల నుంచి వచ్చే నౌకలు విశాఖ తీరానికి చేరుకునేలా ఈ లైట్ హౌస్ ను నిర్మించారు. సముద్రంలో 12 మైళ్ల దూరంలోని నౌకలకు కనిపించేలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి వెలుగులను విరజిమ్మేది.
దీనికి గతంలో పలుమార్లు మరమ్మతులు చేశారు. లైట్ హౌస్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దీన్ని కూల్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. విశాఖ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న లైట్ హౌస్ ను పరిరక్షించాలని నగరవాసులు కోరుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com