కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మనందరికీ సుపరిచితమే. ఆయన సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. విశాల్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన స్టేజీపైనే కుప్పకూలి పడిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ తమిళ హీరో విశాల్ ఆరోగ్యంపై ఇప్పటికే చాలా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆయన షూటింగ్స్ కు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడూ ఫిట్ గా ఉండే విశాల్.. ఈ మధ్య సన్నగా పీలగా మారిపోయి.. వణుకుతూ కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్.. అక్కడే స్టేజీపైనే ఉన్నట్టుండి కుప్పుకూలారు. దీంతో ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. తమిళనాడులోని విల్లుపురంలో కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవం సందర్భంగా తిరునంగైవుల అలకిప్ పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే.. స్టేజీ ఎక్కిన కొద్ది సేపటికే ఆయన స్పృహ తప్పి కింద పడిపోయారు. అయితే.. ప్రాథమిక చికిత్స తర్వాత అనారోగ్యం నుంచి కాస్త తేరుకున్నారు విశాల్.