Thursday, January 9, 2025

విషతుల్య ఆహారం

గురుకులంలో మరోసారి ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత

రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్‌లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బారిన పడుతూ పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా కరీంనగర్ పట్టణం శర్మ నగర్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 23 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, రాష్ట్రంలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఫుడ్‌ పాయిజన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మెస్‌చార్జీలు పెంచి, నాణ్యమైన భోజనం పెడుతున్నాక కూడా విద్యార్థులు ఎందుకు దవాఖానల పాలవుతున్నారో ప్రభుత్వం చెప్పాలని నిలదీస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఓ వెలుగు వెలిగిన గురుకులాలు కాంగ్రెస్ పాలనలో మృత్యు కుహారాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com