మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇలాంటి ఈవెంట్స్ కి రావడం వల్ల ఇక్కడున్న ఎనర్జీ నాకు ఎంతో ఉత్సాహం ఇస్తుంది. ఇంత ఎనర్జీ ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వక్ సేన్ ఫంక్షన్ కి వెళ్తున్నావా? అని అడిగారు. ఏం ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్ కి నేను వెళ్ళకూడదా? విశ్వక్ కి ఈ ప్రశ్న అడగడం నేను చూశాను. దానికి విశ్వక్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అన్నాడు. నిజంగా తనని అభినందిస్తున్నాను. అభిమానులు వాల్ పోస్టర్లు చింపుకోవడం నేను చూశాను. నెల్లూరు లో మా కజిన్స్ ఒకరు రామరావుని, ఒకరు ఏఎన్ఆర్ అభిమానించి ఒకరిని ఒకరు కొట్టుకునేవారు. హీరోలు బాగానే వుంటారు. అభిమానులు కొట్టుకుంటున్నారనే ఆలోచన ఆ రోజు నుంచే నాకు మొదలైయింది. నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సక్యత సహ్రుద్బావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్ లో హనీ హౌస్ లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్ళం. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మేమంతా కలసికట్టుగా వుంటాం. బాలయ్య 50 ఇయర్స్ వేడుకకు నేను వెళ్లాను. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. అందరం కలివిడిగా వుండాలి. పుష్ప 2 పెద్ద హిట్ అయ్యింది. దానికి నేను గర్విస్తాను. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే అందరం ఆనందం పడాలి. ఆ ఆనందం ఇవ్వడానికి ఈ వేడుకకు వచ్చాను. ఇండస్ట్రీ ఒకటే కాంపౌండ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో అనగారిపోయిన కోరిక గబుక్కున పెళ్ళుబికింది. లైలా గెటప్ లో విశ్వక్ కసక్ లా అనిపిస్తున్నాడు(నవ్వుతూ). విశ్వక్ నిజంగా ఆడపిల్ల అయివుంటే గుండెజారి గల్లంతయ్యేది(నవ్వుతూ). అంతగ్లామర్ గా వున్నాడు. నేను, నరేష్, రాజేంద్ర ప్రసాద్ లేడి గెటప్స్ వేశాం. ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. లైలా కూడా హిట్ గ్యారెంటీ. తప్పకుండ ఈ సినిమాకి ఆడియన్స్ వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. విశ్వక్ మాస్ క్లాస్ ఇటు అమ్మాయిగా అద్భుతంగా చేశాడు. దర్శకుడు రామ్ చాలా ఎంటర్ టైన్మెంట్ తో తీశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. విశ్వక్ చాలా ప్రతిభావంతుడు. తన ఇండస్ట్రీలో జెండా పాతాలి. ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో మగవాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకుంటాడు. అభిమన్యు సింగ్, పృద్వీ, ఆకాంక్ష, కామక్షి అందరూ చక్కగా పెర్ఫార్ చేశారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సాహు నిర్మాతగా ఇప్పుడే బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. సినిమా సమ్మర్ లో ప్రారంభం కాబోతోంది. ఇది ఆద్యంతం కామెడీగా వుంటుంది. ఎప్పుడు సెట్స్ లోకి వెళ్లి నటిస్తానా అనే ఉత్సాహం వుంది. సాహు, గోల్డ్ బాక్స్ కొణిదెల సుస్మిత కలసి ఈ సినిమాని నిర్మిస్తారు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్తే. జై హింద్’ అన్నారు.
మాస్ కా దాస్ విశ్వక్సేన్ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవినింగ్. చిరంజీవి గారు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆయన కళ్ళలో ఒక ఆర్టిస్ట్ ఆనందంగా ఫీలవ్వడం కనిపించింది. అది నాకు ఫస్ట్ అవార్డ్, రివార్డ్. మా నాన్న చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. రాజకీయాల్లో ఆయన అనుచరునిగా వున్నప్పుడు మా కారు ఎవరో కాల్చేశారు. అది న్యూస్ గా వచ్చింది. మేము భయంలో వున్నాం. డాడీ ఫోన్ రింగ్ అయితే నేను లిఫ్ట్ చేశాను. హలో ఎవరు అంటే .. నేను చిరంజీవి అనే వాయిస్ వినిపించింది. వెంటనే డాడీకి ఫోన్ ఇచ్చాను. అప్పుడు అనిపించింది మా కారు కాలిపోవడం మంచి పని అయ్యిందని.(నవ్వుతూ) కారు కాలిపోయిందనే దిగులు మర్చిపోయి చిరంజీవి గారు కాల్ చేశారని సెలబ్రేట్ చేసుకున్నాం. అదొక మెమరబుల్ మూమెంట్. నా సినిమాకి ఆయన సపోర్ట్ చేయడానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కథ నా దగ్గరకి తీసుకొచ్చింది సాహు గారు. ఇది నా కెరీర్ లో స్పెషల్ మూవీ. ఈ కథకు న్యాయం చేశానని నమ్ముతున్నాను. రామ్ కథ చెప్పినప్పుడు నవ్వించాడు. నేను జనాల్ని నవ్వించాలని డిసైడ్ అయ్యాను. అనిల్ అన్నకి కంగ్రాట్స్. మెంటల్ హెల్త్ కి మించిన రిచ్ నెస్ మరొకటి లేదు. మెంటల్ పీస్ వున్నవాడు అందరికంటే ధనవంతుడు. ఎవరికీ హాణి చేయకపోడమే మనం చేసే పెద్ద హెల్ప్. సంక్రాంతికి అనిల్ అన్న అందరినీ నవ్వించే సినిమా చేశాడు. అన్నదానం ఎంత గొప్పదో మంచి వినోదం వున్న సినిమా తీయడం కూడా అంత గొప్పది. అదే ప్రయత్నం మేము లైలాతో చేశాం. ఫెబ్రవరి 14న అందరూ థియేటర్స్ కి వచ్చేయండి. సరదాగా ఎంజాయ్ చేయండి. లియోన్ జేమ్స్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నిర్మాత సాహు గారికి అర్చన గారికి థాంక్ యూ. లవ్ యూ మెగాస్టార్ సర్. లైఫ్ లో గుర్తుండిపోయే రోజు ఇది’ అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. లైలా టీం కి నా బెస్ట్ విషెస్. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి సినిమా రిలీజ్ కాబోతుంది. అందరు వెళ్లి సినిమాని ఎంజాయ్ చేసి పెద్ద సక్సెస్ ఇవ్వాలి. విశ్వక్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తను లైలాగా మారిన వీడియో చూసినప్పుడు తన పడిన కష్టం కనిపించింది. ఒక హీరో హీరోయిన్ గా మారి ట్రై చేసిన చాలా సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. అంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సాహు నా మిత్రుడు. మేము బాలయ్య బాబు గారితో సినిమా చేసాం. మళ్ళీ మా ఇద్దరం కలిసి చిరంజీవి గారితో సినిమా చేయబోతున్నాం. చిరంజీవి గారు రీసెంట్ గా బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఇది మెమొరబుల్ జర్నీ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఒక జనరేషన్ ని శాసించిన గొప్ప స్టార్ చిరంజీవి గారు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ కి కల. నాకు ఆ అవకాశం వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత చిరంజీవి గారితో చేయబోయే సినిమా కోసం చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను’అన్నారు.
నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి గ్రాండ్ వెల్కమ్. ఆయన మమ్మల్ని సపోర్ట్ చేయడానికి రావడం చాలా బలాన్ని ఇచ్చింది. అనిల్ రావిపూడి ని తన సినిమా ప్రమోషన్స్ ఆపేయమని అడుగుతున్నాను(నవ్వుతూ). చిరంజీవి గారు మా ఈవెంట్ కి వచ్చారు కాబట్టి ఇకపై మా ప్రమోషన్స్ కనిపిస్తాయి. విశ్వక్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఇప్పుడున్న స్టార్స్ లో ఈ క్యారెక్టర్ చేయడానికి అంత డేరింగ్ ఎవరూ చేయరు. చాలా అద్భుతంగా ఈ క్యారెక్టర్ ని చేశాడు. తన మ్యాజిక్ ని బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ చూస్తారు. చాలా అద్భుతంగా కష్టపడి పని చేశారు. డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అది అద్భుతంగా స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆడియన్స్ అందరూ తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు’అన్నారు.
డైరెక్టర్ రామ్ నారాయణ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. నాకు సినిమా తెలిసింది చిరంజీవి గారి వలనే. ఆయన్ని ప్రత్యేక్షంగా చూడటం అదృష్టంగా భావిస్తున్నాను. అనిల్ గారి నుంచి చాలా నేర్చుకుంటున్నాను. విశ్వక్ కథ ఒప్పుకోవడమే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. లియోన్ జేమ్స్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సాహు గారికి, అర్చన గారికి థాంక్ యూ’ అన్నారు
హీరోయిన్ ఆకాంక్ష శర్మ మాట్లాడుతూ.. ఇది నా తొలి తెలుగు ఫిల్మ్. చిరంజీవి గారి సమక్షంలో తెలుగు ఆడియన్స్ కి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. విశ్వక్ లైలా క్యారెక్టర్ లో ఇమిడిపోయారు. ఆయన ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతం. ఆయన నాకు ఇందులో టఫ్ కాంపిటేషన్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు ధన్యవాదాలు’ తెలిపారు.
యాక్టర్ అభిమన్యు సింగ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన విశ్వక్, డైరెక్టర్ నిర్మాతలకు థాంక్ యూ. ఈ సినిమా మాజా ఇస్తుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది’ అన్నారు.
యాక్టర్ 30 ఇయర్స్ పృద్వీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో మేకల సత్తి అనే క్యారెక్టర్ చేశాను. చాలా అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకి ధన్యవాదాలు. విశ్వక్ గారు లైలా క్యారెక్టర్ లో ఇరగదీశారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.
రైటర్ వాసుదేవ్ మూర్తి మాట్లాడుతూ.. కథని నమ్మిన సాహు గారికి థాంక్ యూ. డైరెక్టర్ గారు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనతో ఎప్పటినుంచో జర్నీ చేస్తున్నాను. విశ్వక్ గారు లైలా, సోనూ గా చాలా బాగా చేశారు. కొత్త క్యారెక్టర్స్ చేస్తున్న ఆయనకి నిజంగా హ్యాట్సప్. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్న ఈవెంట్ కి నేను రైటర్ కావడం చాలా ఆనందంగా వుంది’అన్నారు
లిరిక్ రైటర్ పెంచల్ దాస్ మాట్లాడుతూ.. ముందుగా చిరంజీవి గారికి నా ప్రణామాలు. నా మొదటి పాట దారి చూడు షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రాశాను. నన్ను సపోర్ట్ చేసిన నిర్మాత సాహు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా ఓహో రత్తమ్మ పాట రాశాను. పాట అద్భుతంగా వచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది’ అన్నారు.
లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడుతూ..చిరంజీవి గారు ముఖ్య అతిధిగా విచ్చేసిన సినిమాని నేను పాటలు రాయడం చాలా ఆనందంగా వుంది. లైలాలో ఇచ్చుకుందాం బేబీ పాట రాశాను. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న విశ్వక్ గారికి థాంక్ యూ’ అన్నారు.
భాను మాస్టర్ మాట్లాడుతూ.. లైలా ఫిబ్రవరి 14న మీ అందరినీ అలరించబోతోంది. సినిమా మజా వుంటుంది. విశ్వక్ గారు అదరగొట్టారు. సాహు గారికి థాంక్ యూ సో మచ్. ఇది పక్కా బ్లాక్ బస్టర్’ అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.