Wednesday, September 18, 2024

వాయిస్‌ మెసేజ్‌ ఇకపై టెక్ట్స్‌ మెసేజ్‌.. వాట్సాప్ లో కొత్త ఫీచర్

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వినియోగదారులు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడానికి వాట్సాప్ పై ఆధారపడున్నారు. ఇప్పుడు వాట్సాప్ లేని ప్రపంచాన్ని ఊహించుకోలేము అంటే ఏ మాత్రం అతియోశక్తి కాదేమో.

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులో తీసుకువస్తోంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ వాట్సాప్ లో సమాచార మార్పిడిని మరింత సులభతరం చేస్తుంది. ఇప్పుడు వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్స్ ఫీచర్ ను ఇంట్రడ్యూస్ చేసింది.  కొత్త ఫీచర్ వినియోగదారులు వారు అందుకున్న వాయిస్ సందేశాల ట్రాన్స్క్రిప్షన్ల ద్వార మెస్సేజ్ రూపంలో చదవడానికి వీలవుతుంది.

 

ప్రధానంగా ఇతరు పక్కన ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు వాయిస్ మెస్సేజ్ లను వినడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాట్సాప్ తీసుకువచ్చిన వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్స్ ఫీచర్ ద్వార వాయిల్ మెస్సేజ్ లను టెక్స్ట్ రూపంలో మారుస్తుంది. దీంతో మనం వాయిస్ మెస్సేజ్ లను పదాల రూపంలో చదువుకుని రిప్లై ఇవ్వవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారు ఈ కొత్త అప్డేట్ ను వినియోగుంచుకోవాలంటే మీ ఫోన్ లో వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్లను అప్ డేట్ చేసుకోవాలి.

 

ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ యొక్క తాజా వర్షన్ ఇన్స్టాల్ చేయబడిందో లేదో నిర్ధారించుకోవాలి. లేదంటే గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి వాట్సాప్ న్యూ వెర్ష్ ను అప్డేట్ చేసుకోవాలి. ఆ తరువాత మీ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేసి, సెట్టింగ్ మెనూకి వెళ్లి.. యాప్ యొక్క రైట్ సైడ్ పైన ఉన్న మూడు నిలువు చుక్కలను నొక్కి సెట్టింగ్ లోకి వెళ్లాలి. సెట్టింగుల మెనూలో చాట్ సెట్టింగుల ట్యాబ్ కు నావిగేట్ చేయాలి. ఇక్కడ మీరు మీ చాట్లు, సందేశాలకు సంబంధించిన ఎంపికకు సంబందించిన లిస్ట్ లోకి వెళ్లాలి.

 

వాయిస్ నోట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని స్విచ్ ను టోగుల్ చేయాలి. ఈ ఆప్షన్ ను ఎనేబుల్ చేసిన తర్వాత, మీరు మీ చాట్స్ లో అందుకున్న వాయిస్ మెస్సేజ్ లను ట్రాన్స్క్రిప్షన్లను స్వీకరించడం మొదలవుతుంది. ఇంకేముంది మీరు వాట్సాప్ లో వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్ట్లను మెస్సేజ్ రూపంలో ఈజీగా చదువుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం వెంటనే మీ వాట్సాప్ లో ఈ సెట్టింగ్స్ మార్చుకుని కొత్త ఫీచర్ ను ఎంజాయ్ చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular