Saturday, April 19, 2025

పలు జిల్లాలో ఓటర్ల నిరసన..!

మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్

ఎన్నికల వేళ పలు చోట్ల ఓటర్లు తమకు మౌలిక సౌకర్యాలను కల్పించాలని కోరుతూ ఓటు వేయకుండా నిరసనకు దిగారు. కొన్ని సంవత్సరాలుగా అధికారులు తమకు సౌకర్యాలను కల్పించడంలో విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే….కొత్తూరు మండల పరిధిలోని ఓటర్లు ఓటు వేయకుండా నిరసన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండల పరిధిలోని కోడిచర్ల తండవాసులు ఓటు వేయకుండా సోమవారం నిరసనకు దిగారు. తమ తండాకు పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తండా నుంచి పోలింగ్ బూత్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నందును వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం కూడా లేనందును తండాలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని రోడ్డుపై బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తూరు ఎమ్మార్వో తండా ప్రజలకు వచ్చే ఎన్నికల నాటికి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ అనంతరం తండా వాసులు నిరసనను విరమించారు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో చెంచుల ఆందోళన
మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో ఓట్లు వేయకుండా ఓటర్లు ధర్నా చేపట్టారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు సోమవారం ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మూడురోజుల నుంచి కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చెంచులమని మమ్మలను ఎవరూ పట్టించు కోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయని, కరెంట్ లేకపోవడంతో పాముకాటుకు గురి కావాల్సివస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆ గూడెనికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీనిచ్చారు.

మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని ఓటింగ్ బహిష్కరణ
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని రాయమాదారం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం కొమ్ముగూడెం తండా వాసులు సాగు, తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడంలేదని ఓటింగ్ స్లిప్పులు చూపుతూ నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో బల్మూర్ మండలం మైలారం గ్రామస్థులు మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కలలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి పరిధిలోని రామ్‌సాగర్ తండా వాసులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com