Thursday, January 2, 2025

ఇంటికి వెళ్లండి

  • బీఎస్​ఎన్​ఎల్​ లో మళ్లీ వీఆర్​ఎస్​
  • ఈసారి 19 వేల మంది ఇంటికి

బీఎస్ఎన్ఎల్ లో మరోసారి సంస్కరణలు మొదలయ్యాయి.19 వేల (35%) ఉద్యోగులే లక్ష్యంగా రెండోసారి స్వచ్ఛంద పదవీవిరమణ పథకం (వీఆర్ఎస్) అమలుకు టెలికం శాఖ సిద్ధమవుతోంది. బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరిచేందుకు వీఆర్‌ఎస్‌ ద్వారా టెల్కోలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని (డిపార్ట్​మెంట్​ఆఫ్​ టెలీ కమ్యూనికేషన్స్) ​డాట్‌కు బోర్డు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి కోరినట్టు సమాచారం. ఇందుకు రూ.15వేల కోట్లు అవసరమవుతాయి.

బీఎస్ఎన్ఎల్ ఆదాయంలో 38% అంటే రూ.7,500 కోట్లు జీతాలకే వెళ్లిపోతోంది. దీనిని రూ.5,000 కోట్లకు తగ్గించాలన్నది ప్లాన్. ఆర్థిక మంత్రిత్వశాఖతో పాటు కేబినెట్‌ ఆమోదం అనంతరం వీఆర్‌ఎస్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే ప్రెసెంట్​వీఆర్‌ఎస్‌ ప్లాన్‌ ఇంకా అంతర్గత చర్చల్లో ఉందని, దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సంస్థకు చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీకి 55 వేల ఉద్యోగులున్నారు. తొలి విడత వీఆర్ఎస్ కు మంచి స్పందనే లభించడం గమనార్హం.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com