రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డును తీసుకొచ్చిందని, సుప్రీంకోర్టుకు మించి వక్ఫ్ బోర్డుకు అధికారాలిచ్చారని బిజెపి ఎంపి కొండా వివ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం. నవ్వాలో.. ఏడవాలో.. బాధపడాలో తెలియని పరిస్థితిగా ఉందని అన్నారు. ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడారు. ‘300 ఏళ్ల క్రితం ఔరంగజేబు నోటి మాటతో భూములు ఇచ్చి ఉండొచ్చు. కానీ, నేడు కుప్పలు కుప్పలుగా డాక్యుమెంట్స్‌తో ఆ భూములు మావి అని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకం.. ఎవరైనా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే.. శీతాకాల సమావేశాల్లో వక్ఫ్‌బోర్డు బిల్లు పార్లమెంట్‌లో పాస్ అవుతుంది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదు‘ అని ఎంపీ అన్నారు.