Thursday, January 16, 2025

దేశంలో రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం

ఒకటి మా రాజ్యాంగ సిద్దాంతం, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలం.
మోహన్‌ ‌భగవత్‌ ‌వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వొస్తాయి
రామమందిర నిర్మాణం రోజే నిజమైన స్వాంత్య్రం అంటారా?
కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవంతో రాహుల్‌ ‌విమర్శలు

అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన రోజునే భారత్‌ ‌నిజమైన స్వాంత్య్రం పొందిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిని కాంగ్రెస్‌ ‌నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ.. భాగవత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వొస్తాయని అన్నారు. దిల్లీలో కాంగ్రెస్‌ ‌నూతన ప్రధాన కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. దీనికి ఇందిరాభవన్‌ ‌గా నామకరణం చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌పై ధ్వజమెత్తారు. ‘దేశంలో రెండు సిద్దాంతాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకటి మా రాజ్యాంగ సిద్దాంతం, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలం. 1947లో దేశానికి స్వాతంత్య్ర రాలేదంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌దేశ ప్రజలందరినీ అవమానించారు.

బ్రిటీష్‌ ‌వారిపై పోరాడిన యోధులందరినీ ఆయన కించపరిచారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయి. ఇకనైనా ఇలాంటి పిచ్చి మాటలు వినడం ఆపాలి‘ అని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌నేతలు తమ సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారని ఆయన ఈసందర్భంగా గుర్తుచేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేవారిని ఆపగలిగేది తమ పార్టీ మాత్రమేనని అన్నారు. తమ పోరాటంలో న్యాయం ఉందని, దాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ‌తీరుపైనా రాహుల్‌ ‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయానికి మహారాష్ట్రలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. దానికి సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు ఈసీ నిరాకరిస్తోంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం ఈసీ బాధ్యత. మన ఎన్నికల వ్యవస్థలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయని రాహుల్‌ ఆరోపించారు. అనంతరం నూతన ప్రధాన కార్యాలయం గురించి స్పందిస్తూ.. ఈ కొత్త భవనం కాంగ్రెస్‌ ‌కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది. ఇది ప్రతి కాంగ్రెస్‌ ‌కార్యకర్తకు చెందుతుందని పేర్కొన్నారు.  ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభమైంది.

బుధవారం ఉదయం పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  నూతన భవనంలో కాంగ్రెస్‌ ‌పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ భవానానికి ఇందిరాభవన్‌గా నామాకరణం చేశారు. నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్‌ ‌గాంధీ , ప్రియాంక గాంధీ, కెఎస్‌ ‌వేణుగోపాల్‌, ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తం కుమార్‌ ‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్ర 1947లో రాలేదని, రామ్‌ ‌మందిర్‌ ‌నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ అన్నారని, దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయని, అందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం తమదని, మరొకటి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలమని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌ ‌భావజాలంలో పెద్ద, చిన్న కులాలు, తర తమ బేధాలు ఉండవని, రాజ్యాంగంలో అదే రాసి ఉందని రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో పూర్తిగా కేంద్రీకృతమైన విధానాలు, నిర్ణయాలు ఉంటాయన్నారు.

మోహన్‌ ‌భగవత్‌ ‌రాజ్యాంగం చెల్లుబాటు కాదని చెబుతున్నారని, బ్రిటీష్ ‌మీద జరిగిన పోరాటాన్ని గుర్తించడం లేదని విమర్శించారు. వారికి త్రివర్ణ పతాకంపై గౌరవం లేదని, రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్‌ ‌పార్టీయేనని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌భావజాలం ఇవాళ్టిదో.. నిన్నటిదో కాదని.. వేల సంవత్సరాల ఆర్‌ఎస్‌ఎస్‌ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ వేల ఏళ్లుగా మా ఐడియాలజీ కొనసాగుతూ వచ్చిందని అన్నారు. గురునానక్‌, ‌గౌతమ బుద్ధుడు, కృష్ణుడు.. వీళ్లంతా ఆర్‌ఎస్‌ఎస్‌ ఐడియాలజీనా.. అని ప్రశ్నించారు. ఈ కొత్త భవనం కాంగ్రెస్‌ ‌భావజాలానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ భవనంలో ఉన్న అందరూ ఆ భావజాలాన్ని కాపాడేవారేనని.. బీజేపీకి లొంగిపోయేవారు కాదని అన్నారు. ఈ భవంతి బయట మిలియన్ల కొద్దీ ప్రజలు మన భావజాలానికి మద్దతుగా ఉన్నారని, ఈ భావజాలం దేశం నలుమూలలకు మరింతగా విస్తరించాలని రాహుల్‌ ‌గాంధీ పిలుపిచ్చారు. ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్‌ ‌పార్టీ నూతన ప్రధాన కార్యాలయం గురించి స్పందిస్తూ.. ఈ కొత్త భవనం పార్టీ కార్యకర్తల రక్తంతో రూపుదిద్దుకుంది అన్నారు.. ఇది ప్రతి కాంగ్రెస్‌ ‌కార్యకర్తకు చెందుతుంది అని రాహుల్‌ ‌గాంధీ వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com